ఎన్ టి ఏ (నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్)
విజయవాడ : ఉపాధ్యాయ ఆత్మగౌరవ ఉద్యమం 2 లో భాగంగా ఉపాధ్యాయులకు పదోన్నతి చానల్
ఇతర విభాగాలు మాదిరి ఏర్పాటుకు కృషి చేయాలని అమరావతి ఏసి చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లుకి నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు
కరణం హరికృష్ణ వినతి పత్రం సమర్పించినట్లు ఒక ప్రకటన లో తెలిపారు. ఉపాధ్యా
యులు 2 దశాబ్దాలుగా నష్టపోతున్న వైనాన్ని తెలియజేయడం జరిగిందని చెప్పారు.
జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టులందు 70 శాతం ఉపాధ్యాయులకు పదోన్నతుల
ద్వారా కల్పించాలి. +2 పాఠశాలల్లో 8,9,10,11,12 తరగతుల బోధనకు పాఠశాల
సహాయకులకు హోదా కలిగిన పదోన్నతి కల్పించాలని కోరారు. బొప్పరాజు వెంకటేశ్వర్లు
మాట్లాడుతూ ఉపాధ్యాయుల పదోన్నతులకై కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో
మద్దతు సంఘాల నాయకులు డిటి బ్లూ ఎ రాష్ట్ర అధ్యక్షులు పెద్దన్న, ఎస్ఎల్టఇఎ
ఆదిశేషు, పిఎస్ హెచ్ ఎం, లక్ష్మీనారాయణ, ఆపస్ ఎర్రి స్వామి,జెఎల్పిపివి
ప్రసాద్, ఎన్ టి ఏ మోహన్ , శ్రీనివాసులు, జితేంద్ర, ఇతర నాయకులు నాగన్న
శివశంకరయ్య తదితరులు పాల్గొన్నారు. కోర్టు తీర్పు ప్రకారం 302 అనుసరించి
వెంటనే ఉపాధ్యాయులకు జూనియర్ లెక్చరర్ల పదోన్నతులు కల్పించాలన్నారు.