సిఐడి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ‘1091- ట్రాన్స్ జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్
సెల్’ ను ప్రారంభించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ
గుంటూరు : సిఐడి డిపార్ట్మెంట్ గుంటూరు కార్యాలయంలో బుధవారం సిఐడి ఎస్పీ
హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ ఆధ్వర్యంలో ట్రాన్స్ జెండర్ ల భద్రత, రక్షణ కోసం
ఏర్పాటు చేసిన 1091 హెల్ప్ లైన్ ను మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్ లను హేళన చేయడం,
వారిని అవమానించడం, వారి వైకల్యాన్ని రాజకీయ పరిభాషలో ఎదుటివారిని తిట్టడానికి
తిట్టుగా ఉపయోగించడం చాలా బాధాకరం అన్నారు. ట్రాన్స్ జెండర్ ల భద్రతకు,
రక్షణకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు . వీరు కూడా ప్రేమ పేరుతో
మోసపోవడం దీంతో చాలామంది ఆత్మహత్యలు, హత్యలకు గురవుతున్నారన్నారు. వాటిని
నిరోధించడం వారి సమస్యల పరిష్కారానికి హెల్ప్ లైన్ అన్నారు. ఈ హెల్ప్ లైన్
ద్వారా వారికి అవసరం అయితే సిఐడి డిపార్ట్మెంట్ వారు కౌన్సిలింగ్ కూడా ఏర్పాటు
చేయడం జరుగుతుందన్నారు. ట్రాన్స్ జెండర్ లకు కూడా ఆత్మాభిమానం ఉంటుందన్నారు.
అందుచేతనే ఈ హెల్ప్ లైన్ పేరును ‘స్వాభిమానం’గా నామకరణం చేయడం జరిగిందన్నారు.
ముఖ్యంగా ట్రాన్స్ జెండర్ ల ఆర్థికపరమైన అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి
సారించడం జరిగిందన్నారు. దీనిపై అనేక ప్రతిపాదనలు రావడంతో సమావేశంలో చర్చ
జరిగిందన్నారు. ట్రాన్స్ జెండర్లు ఆర్థికపరమైన అభివృద్ధిని సాధించే దిశగా
ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. వారిని నిరాకరించడం సమాజంలో మంచి విషయం
కాదు. వారు కూడా సంస్కరింపబడాలి అనేది వారి కమ్యూనిటీకి స్పష్టంగా చెప్పడం
జరిగింది. వారిని వారు సంస్కరించుకుంటూ ప్రభుత్వ, పోలీస్, స్వచ్ఛంద సంస్థల
సహకారం పొందాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, వారి సమస్యలను అధిగమించాలని
సూచించారు.
ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ ల గ్రూప్ లీడర్లకు వివరించడం జరిగింది. అనంతరం
ఎస్పీ సిఐడి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్, ఎస్పీ సరిత( ఉమెన్ వింగ్), తదితరులు
ప్రసంగించారు. ట్రాన్స్ జండర్ల అనుమానాలను నివృత్తి చేస్తూ వారికి కేంద్ర
రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను వివరించారు.
అనంతరం ఎస్పీ సిఐడి డిపార్ట్మెంట్, ఎస్పి కే.వీ జీ సరిత, ప్రకాష్ రెడ్డి
డైరెక్టర్ డిజేబుల్ అండ్ ట్రాన్స్ జెండర్స్ పర్సన్స్, డాక్టర్ కామేశ్వర్
ప్రసాద్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏపీ ఎస్సే సి ఎస్, సత్యవతి ఫౌండర్
ఉమెన్స్ భూమిక, రచన ముద్రబోయిన రిసోర్స్ పర్సన్, అపర్ణ రీజనల్ కోఆర్డినేటర్
విహెచ్ఎస్, మహిళా శిశు సంక్షేమ శాఖ పిడి మనోరంజని తదితరులు కార్యక్రమంలో
పాల్గొన్నారు..