పేదలుంటే మురికివాడలవుతాయా..?
సామాజిక సమతుల్యత దెబ్బతింటుందా..?
ధనవంతులు మాత్రమే అమరావతిలో ఉండాలంటున్నారు
పేదలపై టీడీపీకి ఉన్న చిన్నచూపు నేడు సుప్రీం తీర్పుతో స్పష్టమైంది.
బాబు అండ్ కో రియల్ ఎస్టేట్ భూముల కోసం ఎంతటికైనా తెగిస్తారు
ఆరు నూరైనా సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి అదిమూలపు సురేష్
ఒంగోలు : పేద ప్రజలకు అమరావతి లో ఇళ్ల స్థలాలు ఇవ్వవచ్చు అని సుప్రీం కోర్టు
ఇచ్చిన తీర్పు సీఎం జగన్మోహన్ రెడ్డి సామాజిక న్యాయం దిశగా వేస్తున్న
ముందడుగు అని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు
సురేష్ అన్నారు. సుప్రీం తీర్పును స్వాగతిస్తూ ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో
ఆయన విలేకరులతో మాట్లాడారు.
బుధవారం మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనే
నినాదంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తుంటే దానిని అడ్డుకోవాలని,
దానిని అమలుపరచకూడదని పేద ప్రజలకు ఇల్లు ఇవ్వకూడదని కొందరి కడపు మంట. ఈ
పట్టాలు ఇవ్వడం ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, పేద
ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండిపోతారని వారి భయం.
అడుగడుగునా ఆటంకాలు సృష్టించి ఏ విధంగానైనా ఈ పట్టాలను ఇవ్వకుండా
అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అటువంటి వారికి కొన్ని పత్రికలు, చానళ్లు కూడా
మద్దతుగా నిలిచి, అసత్యాలను పదేపదే రాసి ఈ మహా యజ్ఞాన్ని అడ్డుకోవాలని చూశారు.
సుప్రీంకోర్టులో అమరావతి రైతుల తరఫున వాదించిన లాయర్లను చూస్తే ఎంత ఖర్చు
పెట్టి ఆ లాయర్లను ఏర్పాటు చేసుకున్నారో అర్థమవుతోంది. రైతుల ముసుగులో కొందరు
వ్యాపారులు చేసిన ప్రయత్నం ఇది అని అందరికీ అర్థమైంది. అమరావతిలో అణగారిన
వర్గాలకు ఇళ్ల స్థలాలు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అనేంతవరకూ వాళ్ళు
వెళ్లటం ఎంత దుర్మార్గం..?. అంటే కేవలం ధనవంతులు మాత్రమే అమరావతిలో ఉండాలి.
పేదలు ధనవంతుల పక్కన ఉండటానికి వీళ్లేదనేదే వారి అభిప్రాయం. దళితులపై టీడీపీకి
ఉన్న చిన్నచూపు ఎలాంటిదో మరొకసారి రుజువు చేశారు.
అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం అభివృద్ధి కాదా?. ఇదే ప్రశ్న
కోర్టులు కూడా ప్రస్తావించాయి.
ఆర్5 జోన్ పరిధిలో దాదాపు 51 వేల ప్లాట్లను పేదలకు అందించడం వారి అభివృద్ధి
మార్గానికి సోపానంగా మేము భావిస్తున్నాం. ఆర్ 5 జోన్ లో చట్టప్రకారం
ఈడబ్ల్యూఎస్ వారికి 5 శాతం ఇవ్వాలని 2014 చట్టంలో పొందుపరచిన విషయం మీకు
కనబడటం లేదా?. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని మేము
ముందునుంచి చెబుతున్న మాట ఇప్పడు నిజమేనని రుజువయింది. ఆరు నూరైనా సీఎం ఆలోచన
విధానం మేరకు ఆయన అమృత హస్తాల మీదుగా పట్టాలు పంపిణీ చేసి పేద ప్రజల సొంతింటి
కల నిజం చేస్తామన్నారు.