కి కృతఙ్ఞతలు తెలిపిన మైనారిటీలు
పవిత్ర హజ్ యాత్రను రాజకీయం చేయడం హేయం : వెలంపల్లి
విజయవాడ : స్థానిక పంజా సెంటర్ వద్ద గల షాజహూర్ ముసాఫిర్ ఖానా నందు ఎన్టీఆర్
జిల్లా నుండి హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి మైనారిటీ సోదరులకు వాక్సినేషన్,
యాత్ర యొక్క నియమ నిబంధనలు తెలిపేందుకు రాష్ట్ర హజ్ కమిటీ వారు ప్రత్యేక
కార్యక్రమాన్ని బుధవారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా
రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ బద్వేల్ షేక్ గౌస్ లాజాం, ఎన్టీఆర్ జిల్లా వై యస్
ఆర్ సిపి అధ్యక్షులు, విజయవాడ పశ్చిమ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు,
శాసన మండలి సభ్యులు ఎండి రుహుల్లా, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ముఖ్య
అథిధులుగా పాల్గొని ముందుగా జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి కృతఙ్ఞతలు తెలుపుతూ కేక్ కట్ చేసారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ మైనారిటీల పక్షపాతి జగన్
మోహన్ రెడ్డి అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పవిత్ర హజ్ యాత్రకు గన్నవరం
నుండి బయలుదేరు 18వందల 13 మంది యాత్రికులకు అదనంగా పడే 14 కోట్ల 51 లక్ష
రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రత్యేక ఆర్ధిక సహాయం కింద ప్రతి
యొక్క యాత్రికుల అకౌంట్లో నేరుగా జమ చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డికి ఎన్టీఆర్ జిల్లా మైనారిటీల తరుపున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు.
దేశంలో ఏ రాష్ట్రం చేయనటువంటి ఆర్ధిక సహాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్
మోహన్ రెడ్డి చేశారని తెలిపారు. పవిత్ర హజ్ యాత్రను కూడా ప్రతిపక్షాలు రాజకీయం
చేయడం హేయం అన్ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వక్ఫ్ బోర్డు
అధ్యక్షులు గౌస్ మొహిద్దీన్, కార్పొరేటర్లు అబ్దుల్ అర్షద్ అకీబ్, షైక్
రహమతున్నీసా, ఇర్ఫాన్, వక్ఫ్ బోర్డు సభ్యులు షకీల్, యూనస్, అబ్దుల్ నజీర్,
కోఆప్షన్ సభ్యులు సయ్యద్ అలీం తదితరులు పాల్గొన్నారు.