విశాఖపట్నం : విశాఖ నగరంపై వాతావరణ ప్రభావం అధికంగా ఉంటుందని నగర మేయర్
గొలగాని హరి వెంకట కుమారి తెలిపారు. శనివారం ఆమె నోవోటెల్ లో వాతావరణం
మార్పుపై జరిగిన వర్క్ షాపులో జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయి కాంత్ వర్మతో కలిసి
ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజాస్వలన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్
మాట్లాడుతూ విశాఖ నగరంపై వాతావరణ ప్రభావం అధికంగా ఉంటుందని, ముఖ్యంగా విశాఖ
తీర ప్రాంతముతో పాటు పారిశ్రామిక నగరం అవడం వలన వాతావరణంలో మార్పులు ఉంటాయని
తెలిపారు. ముఖ్యంగా విశాఖ నగరాన్ని ట్రాన్స్ఫర్మేషన్ క్లైమేట్ యాక్షన్
ప్రాజెక్టుకు ఎంపిక చేయబడిందని అందుకు యూనైటెడ్ నేషనల్ యూనివర్సిటీ, నేషనల్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్, ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇన్స్టిట్యూట్లకు
కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ నగరం మత్స్యకారుల అధికంగా ఉండే గ్రామమని,
కాలక్రమేణా పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిందని, 680 చదరపు అడుగుల
కిలోమీటర్ల భూభాగం, 2 మిలియన్ల జనాభా, 8 జోన్ లు, 98 వార్డులుగా
విభజించబడిందని, అంతేకాకుండా భారతదేశంలో 100 స్మార్ట్ నగరాలలో విశాఖ నగరం
ఒకటని తెలిపారు. విశాఖ నగరానికి తుఫాన్ ప్రభావం అధికంగా ఉంటుందని, 2014లో
హుద్-హుద్ తుఫాన్, 2021లో గులాబ్ లాంటి తుపానులను ఎదుర్కొన్నామని
పేర్కొన్నారు. విశాఖ నగరం వాతావరణానికి అనుగుణంగా మార్పు చేయవలసిన అవశ్యకత
ఎంతైనా ఉందని అందుకు పలు సంస్థలు కృషి చేయాలని ముఖ్యంగా వర్షపు నీరు భూమిలో
ఇంకే విధంగా చూడాలని, ఇంకుడు గుంతలు, చెట్లు పెంపకం, ప్లాస్టిక్ నిర్మూలన తో
పాటు విద్యాసంస్థలు వ్యాపార సంస్థలు పారిశ్రామిక సంస్థలు వారంలో ఒక్కరోజు
ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించే విధంగా చర్యలు చేపట్టినట్లయితే కొంతవరకు
కాలుష్య నియంత్రణ చేయవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి విశాఖ నగరాన్ని విపత్తుల నుండి ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు
తీసుకుంటున్నారని పేర్కొన్నారు. విశాఖ నగరంలో వాతావరణం మార్పు కొరకు అనేక
ప్రాజెక్టులు చేస్తున్నారని అందులో భాగంగా సోలార్ ఎనర్జీ, ఎల్ఈడి స్ట్రీట్
లైట్, విద్యుత్ వాహనాలు, నీటి ప్రాజెక్టులు మొదలైనవి వినియోగం ద్వారా గాలిలో
కార్బన్డయాక్సైడ్ ను తగ్గించుకోగలిగామని తెలిపారు. అనంతరం జీవీఎంసీ కమిషనర్
మాట్లాడుతూ విశాఖ నగరానికి విశాలమైన తీర ప్రాంతం ఉందని అందువలన అధికంగా
తుపానుల ప్రభావం ఉంటుందని , తుపానులు సంభవించేటప్పుడు ముందస్తు చర్యలు
చేపట్టవలసిన అవసరం ఉందని, అంతేకాకుండా తుఫాన్ల ప్రభావం విశాఖ నగరం పై అధికంగా
పడకుండా చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాల్సిన అవసరం
ఉందన్నారు. అలాగే జల వాయు కాలుష్యాన్ని తగ్గించుకోవడం వలన కొంతవరకు
సత్ఫలితాలను సాధించవచ్చు అన్నారు.విశాఖ నగరాన్ని ట్రాన్స్ఫర్మేషన్ క్లైమేట్
యాక్షన్ ప్రాజెక్టుకు ఎంపిక చేయబడిందని అందుకు యూనైటెడ్ నేషనల్ యూనివర్సిటీ,
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్ ఎనర్జీ అండ్ రిసోర్స్
ఇన్స్టిట్యూట్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎనర్జీ అండ్ రిసోర్స్
ఇన్స్టిట్యూట్ సీనియర్ డైరెక్టర్ సెత్, యునైటెడ్ నేషనల్ యూనివర్సిటీ జర్మనీ,
అసిస్టెంట్ అకాడమిక్ అధికారి డా. హిమాన్సు శేఖర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్
అర్బన్ అఫైర్స్ శరత్ బాబు, జీవీఎంసీ పర్యవేక్షణ ఇంజనీర్ గోవిందరావు తదితరులు
పాల్గొన్నారు.