సుశిక్షితుల్ని చేసే విద్యాలయాలు ఎంతో అరుదుగా నెలకొల్పుతారు. సాధారణంగా వైద్య
కళాశాలలు వైద్యంలో డిగ్రీ కోర్సును, మాస్టర్స్ కోర్సును, పి.హెచ్.డి.
సదుపాయాన్ని అందజేస్తాయి. ఇంతే కాకుండా వైద్యవిద్యకు అనుబంధంగా నర్సింగ్,
ఫిజియోథెరపీ, లాబొరేటరీ టెక్నాలజీ వంటి కోర్సులను కూడా బోధిస్తాయి. వైద్య
కళాశాలలకు అనుబంధంగా హాస్పిటల్ ద్వారా వైద్య సదుపాయం కూడా ఉంటుంది.
వైద్యవిద్యలో బోధించే కొన్ని విద్యావిభాగాలు హ్యూమన్ అనాటమీ, బయోకెమిస్ట్రీ,
ఫార్మకాలజీ, ఇమ్యునాలజీ, ప్రసూతి వైద్యం (ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజీ),
ఎనస్తీషియాలజీ, అంతర్గత వైద్యం (ఇంటర్నల్ మెడిసిన్), కుటుంబ వైద్యం,
శస్త్రచికిత్స (సర్జరీ), జెనిటిక్స్, పాథాలజీ (రోగ నిర్ధారక శాస్త్రం). ఇవే
కాకుండా గుండె, కన్ను, ముక్కు, చెవి, చర్మం, మెదడు, మానసిక ప్రవృత్తి వంటి
విషయాలకు సంబంధించిన విద్యాబోధనలకై ప్రత్యేక విభాగాలుంటాయి. వైద్య కళాశాలలు
ఉన్న ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందటం గమనించవచ్చు.
మచిలీపట్నం నుండి కరగ్రహారంకు వెళ్లే మార్గంలో మచిలీపట్నం వైద్య కళాశాల
నిర్మించబడింది. స్థల సేకరణ కోసం 13 కోట్ల 62 లక్షల 48 వేలు రూపాయలను
ప్రభుత్వం రైతులకు చెల్లించి 65 ఎకరాల విస్తీర్ణంలో 550 కోట్ల రూపాయల
వ్యయంతో మచిలీపట్నం మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 18 నెలల వ్యవధిలో శరవేగంగా
అత్యంత నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసింది. ఆంధ్రప్రదేశ్ లో నాలుగో మెడికల్
కళాశాల ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఇటీవల గ్రీన్ సిగ్నల్
ఇచ్చింది.
మచిలీపట్నం మెడికల్ కాలేజీకి అనుమతులు మంజూరు చేసింది. లెటర్ అఫ్ పర్మిషన్ తో
పాటు 150 ఎంబీబీఎస్ సీట్లతో 2023 -24 విద్యా సంవత్సరం నుంచి వైద్య తరగతులు
ప్రారంభించేందుకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చింది. దీంతో ఈ ఏడాది మచిలీపట్నం వైద్య
కళాశాలలో 150 మంది మెడికొలు తమ వైద్య విద్యను ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు
సుమారు 2 లక్షల 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణాలు పూర్తి కావడం ఒక
విశేషం. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో డిపార్ట్మెంటల్ బ్లోక్ , 40 వేల
చదరపు అడుగుల విస్తీర్ణంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లోక్, 60 వేల చదరపు అడుగుల
విస్తీర్ణంలో లెక్టరర్ గ్యాలరీ, 40 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎక్సమినేషన్
లైబ్రరీ బ్లోక్ , 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎం బి బి యస్ తొలి
సంవత్సరం చదివే విద్యార్దునుల కోసం వసతిగృహం, అలాగే, 30 వేల చదరపు అడుగుల
విస్తీర్ణంలో ఎం బి బి యస్ తొలి సంవత్సరం చదివే విద్యార్థుల కోసం మరో వసతి
గృహం నిర్మితమైంది. అలాగే ఆసుపత్రి ప్రాంతంలో ఓ పి డి బ్లోక్ లక్షా యాభై వేల
చదరపు అడుగులలో స్లాబ్ దశ పూర్తి కానుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ద్వితీయ
విద్యా సంవత్సరం మెడికల్ కళాశాలకు 2 లక్షల 50 వేల చదరపు అడుగుల ఏరియాలో
నిర్మాణాలు జరగనున్నాయి. మచిలీపట్నం మెడికల్ కళాశాల ఆహ్లాదకర వాతావరణం, స్వ
చ్ఛమైన గాలి ఉన్నదని, ఎంత ఖర్చు పెట్టినా దొరకని పలు సౌకర్యాలు కల్పించారని,
ఇంత మంచిగా వైద్య కళాశాల ఏర్పాటుకు ఇతోధికంగా కృషి చేసిన ముఖ్యమంత్రి
జగన్మోహనరెడ్డికి కృష్ణాజిల్లా ప్రజలు రుణపడి ఉంటారని మాజీ మంత్రి, మచిలీపట్నం
శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) హర్షం వ్యక్తం చేశారు.