కొవ్వూరు : ప్రజలకు మేలైన సేవలు అందించేందుకు ప్రజా ప్రతినిధులు, అధికారులు
అందరూ బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ
మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
భాగంగా 106వ రోజు కొవ్వూరు పట్టణం 4వ వార్డు క్రిస్టియన్ పేటలో హోంమంత్రి
పర్యటించారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి
బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారి
కుటుంబాలకు ప్రభుత్వం చేకూర్చిన లబ్ధిని కుటుంబ సభ్యులకు వివరించారు. ఈ
సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ కుల, మత,
వర్గ, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ఈ నాలుగేళ్ల
కాలంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అందించిన సంక్షేమం గురించి ప్రజల నుండి
అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలుకు జవాబుదారీ
వహిస్తూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు.
మ్యానిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పని హామీలను కూడా చేసి చూపిస్తున్న ఘనత
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని
వాటిని పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీఎం
రూపొందించారన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ఎప్పటికప్పుడు వాటిని
పరిష్కరించాలని సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి
వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పెద్ద
సంఖ్యలో పాల్గొన్నారు.