విజయవాడ : స్థానిక గవర్నర్ పేట లో దాస్ ఆటో సర్వీస్ సెంటర్ నందు ది విజయవాడ
టూ వీలర్స్ మెకానిక్ & వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చలివేంద్ర
మహోత్సవం కార్యక్రమాన్ని మాజీ శాసన సభ్యులు వంగవీటి రాధ కృష్ణ విచ్చేసి
ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంగవీటి మోహనరంగా మా నాన్న
అభిమానులు ఈ చలివేంద్ర కార్యక్రమాలు నిర్వహించటం ప్రతి సంవత్సరం మండు ఎండ లో
వెళ్తున్న ప్రజానీకానికి దాహార్తి తీర్చటం వీరు అందరూ కలిసి ఈ కార్యక్రమం
నిర్వహిస్తుంటారని కొన్ని సంవత్సరాలుగా నేను చూస్తూన్నానని వీరు అందరూ చేసే ఈ
సేవ కి ఎప్పటికీ నేను కృతజ్ఞుడై ఉంటానని అన్నారు.
ది విజయవాడ టూ వీలర్స్ మెకానిక్స్& వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నగర
అధ్యక్షులు ఆంజనేయ దాస్ మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా అభిమానులుగా మేమంతా అనేక
సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటామని అందులో ముఖ్యంగా వేసవి లో ప్రజలకు దాహార్తి
తీర్చే ఈ కార్యక్రమం దిగ్విజయంగా వేసవి నెలలు మొత్తం నిర్వహిస్తామని ఈ
కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలకు సుగంధి వాటర్,
మజ్జిగ, కూలింగ్ వాటర్, ప్రజలకు వితరణ చేస్తామని కొన్ని సంవత్సరాలుగా ఈ
కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి మెకానిక్స్ , వర్కర్స్ అందరూ
ఆనందంగా సహకరిస్తారని అన్నారు. ఈ కార్యక్రమానికి ది టూ వీలర్ అసోసియేషన్ గౌరవ
అధ్యక్షులు ఎం.డి ఫిరోజ్ నగర అధ్యక్షులు ఆంజనేయ దాస్, సెక్రెటరీ జానీ వైస్
ప్రెసిడెంట్ కృష్ణ ఎం.డి కాలేషా, అల్లా బక్షు, చుక్కా భాస్కర్ , ప్రేమ్
కుమార్ నాయుడు గునిశెట్టి తదితర మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.