నకు ప్రారంభోత్సవం చేసిన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి
ఏలూరు, విజయవాడ చిత్తూరు, విశాఖపట్నంలలో రూ. 16 కోట్ల పైచిలుకు వెచ్చించి
నిర్మాణం
భూగర్భ జలాలను ఆధారం చేసుకొని పంటలు పండిస్తాం
భూగర్భ జలాలను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది
ఈ డేటా సెంటర్ ను ప్రారంభించడం సంతోషం
వర్షాలు కురుస్తూ భూగర్భ జలాలు పెరుగుతున్నాయి:
రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
చిత్తూరు : చిత్తూరు జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ వద్ద రూ.1.90 కోట్ల
తో నిర్మించిన భూగర్భ జల, జలగణన శాఖ జిల్లా డేటా సెంటర్ భవనం నకు రాష్ట్ర జల
వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు
ప్రారంభోత్సవం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర
జలవనరుల శాఖ మంత్రి కి జిల్లా కలెక్టర్ సగిలి షన్మోహన్, చిత్తూరు శాసనసభ్యులు
ఆరణి శ్రీనివాసులు, నగర మేయర్ అముద తదితరులు స్వాగతం పలికారు. మంత్రి డేటా
సెంటర్ ను ప్రారంభోత్సవం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ భూగర్భ జల, జన
గణన శాఖ డేటా సెంటర్ ను ప్రారంభించడం సంతోషకరమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా
4 డేటా సెంటర్ లను నిర్మాణం చేయడం జరుగు తోందని, ఇందులో ఏలూరు, విజయవాడ
చిత్తూరు, విశాఖపట్నంలలో రూ. 16 కోట్ల పైచిలుకు వెచ్చించి చేపట్టడం
జరిగిందనన్నారు. ఇప్పటికే ఏలూరు, విజయవాడలో డేటా సెంటర్ల ను ప్రారంభించగా నేడు
చిత్తూరులో ప్రారంభించామని త్వరలోవిశాఖపట్నంలో ప్రారంభిస్తామని తెలిపారు.
భూగర్భ జలాలకు సంబంధించిన వివరాలన్నింటినీ ఈ కేంద్రం నుండి పొందవచ్చునన్నారు.
చిత్తూరు జిల్లాలో మరియు ఈ పరిసర ప్రాంతాలలో జీవ నదులు లేవని భూగర్భ జలాల
మీదే ఆధారపడి వ్యవసాయంతో పాటు తాగునీరు అవసరాలు తీర్చడం జరుగుతున్నదనన్నారు. ఈ
నేపథ్యంలో భూగర్భ జలాల కు అధిక ప్రాధాన్యత కలదని, కాబట్టి భూగర్భ జలాల స్ధాయి
లను తెలుసు కొని వీటి ఆధారంగా ఏ ఏ పంటలను పండించు కోవాలనే పరిజ్ఞానం ను
తెలుసుకోవడం ఈ అంశంపై ప్రజలకు అవగాహనకల్పించడం అవసరమని,ఈ సంబంధింత అంశాల పై ఈ
డేటా సెంటర్ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి
అయిన తర్వాత ఏ మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించ లేదని, వర్షాలు సకాలంలో
కురుస్తున్నాయని దీనితో భూగర్భ జలాలు సమృద్ధిగా కలవని తెలిపారు. కృష్ణ,
గోదావరి, పెన్నా, వంశధార నదులు పొంగి పొర్లు తున్నాయని,వ్యవసాయ ఆధారిత
పరిశ్రమలకు చక్కటి వాతావరణం ఈ నాలుగుసంవత్సరాలలో కలదనన్నారు. ఈ డేటా సెంటర్ ను
ప్రారంభించడం రైతులకు ఎంతో ఉపయోగ కరమనన్నారు. ఈ కార్యక్రమంలో భూగర్భ జల శాఖ
సంచాలకులు జాన్ సత్యరాజ్, సంయుక్త సంఖ్యలు ఎన్. శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ ఈ
విజయ్ కుమార్ రెడ్డి, హెచ్ ఎన్ ఎస్ ఎస్ ఎస్ ఈ రాజ గోపాల్, జిల్లా భూగర్భ జల
శాఖ అధికారి గోవర్ధన్ రెడ్డి, ఈఈ మురళి కుమార్, చిత్తూరు ఆర్డీఓ రేణుక,ఇతర
భూగర్భ జల శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.