కట్టడమేనని, లింగమనేని రమేష్ భవనాలు ప్రభుత్వానికి అప్పగిస్తే ఆధారాలు
చూపించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. క్విడ్ ప్రో
కోలో భాగంగానే రాజధాని నుంచి లింగమనేని భూముల్ని మినహాయించినందుకు నాలుగెకరాల
కరకట్ట భూమిని చంద్రబాబుకు అప్పగించారని ఆరోపించారు. చంద్రబాబు హయాంలో అతి
పెద్ద స్కాం అమరావతి నిర్మాణమని సజ్జల ఆరోపించారు. కరకట్ట మీద అక్రమానికి
చిరునామా ఉందంటే అది బాబు నివాసమేనన్నారు. చంద్రబాబు నివాసాన్ని ప్రభుత్వం
అటాచ్ చేసిందన్నాు. లింగమనేని రమేష్ పేరుతో ఉన్న అక్రమ కట్టడంలో బాబు
ఉంటున్నారని, అది ప్రైవేటు ప్రాపర్టీ అని బాబు అంటున్నారని, ప్రైవేట్ భూమికి
చంద్రబాబు అద్దె చెల్లిస్తే చూపించాలన్నారు. రమేష్ భూములను రాజధాని
అలైన్మెంట్ నుంచి తప్పించినందుకు ప్రతిగా తన గెస్ట్ హౌస్ అప్పటి సిఎంకు
ఇచ్చారని ఆరోపించారు. ప్రభుత్వ ఖర్చులతో ఆ భవంతికి రిపేర్లకు ప్రభుత్వ నిధులు
ఖర్చు చేశారని ఆరోపించారు. లింగమనేని రమేష్ తన భూమిని ప్రభుత్వానికి ఇస్తే
చంద్రబాబు అధికారం కోల్పయిన తర్వాత నివాసాన్ని ఖాళీ చేసి ఉండాలన్నారు. లేదంటే
చంద్రబాబు ప్రతిపక్ష నేత నివాసంగానైనా మార్చుకుని ఉండాలన్నారు. లింగమనేని
రమేష్ కి, హెరిటేజ్‌కి మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగాయని, కరకట్ట మీద ఉన్న
భవంతి అమరావతి స్కాంకు మచ్చుతునక అని పేదలకు ఇళ్లు ఇవ్వకుండా సీఆర్ డీఏ
చట్టంచేసి విలాసవంతంగా ఉండే వారి నగరంగా తీర్చిదిద్దుదామనుకున్నారని సజ్జల
ఆరోపించారు. సీఎం జగన్ వెనుకబడిన వర్గాల అభివృద్ధి దిశగా పనిచేస్తున్నారని,
టీడీపీ, పవన్, లెఫ్ట్ పార్టీలు సంపన్నుల వైపు నిలబడుతున్నారని ఆరోపించారు.
పవన్ కల్యాణ్, చంద్రబాబు ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగన్
రాజకీయ నిర్ణయాలు చంద్రబాబు రాజకీయంగా ఉరితాడు లాంటివని అందుకే తోడేళ్ల మందలా
ఏకమై దాడి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. లింగమనేని రమేష్ నివాసంలో
చంద్రబాబు ఎందుకు ఉంటున్నారో సమాధానం చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు
చెబుతున్నారని ఆరోపించారు. చంద్రబాబు నివాసం సాక్షికగా అక్రమాలకు పాల్పడ్డారని
ఆరోపించారు. సిఐడిని తాము పెట్టలేదని, చట్టం పని చట్టం చేసుకుపోతుందని వాళ్లే
చెబుతారన్నారు. కరకట్ట మీద ఇళ్లు అక్రమమని చెప్పిన టీడీపీ ఆ తర్వాత వాటిలో
ఎందుకు చంద్రబాబు నివాసాన్ని ఏర్పాటు చేసిందన్నారు. లింగమనేని రమేష్ ఇంటికికి
పైసా అద్దె చెల్లించకుండా ఇన్నేళ్లుగా ఉంటున్నారని, అదే సమయంలో ప్రభుత్వం
నుంచి హౌస్ రెంట్ అలవెన్స్ చంద్రబాబు ఎలా తీసుకుంటున్నాడని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి దగ్గర రమేష్ అద్దె తీసుకోకుండా ఉంటున్న ఇంటికి ప్రభుత్వ డబ్బులు
ఖర్చుతో ఎలా ఖర్చు చేయిస్తారని ప్రశ్నించారు. లింగమనేని రమేష్ భూములను
రాజధాని సమీకరణ నుంచి వదిలినందుకు ప్రతిగా ఈ మేలు జరిగిందని సజ్జల ఆరోపించారు.
చంద్రబాబు వంటి నిరుపేదకు రమేష్ నాలుగు ఎకరాలు కేటాయించారని ఎద్దేవా చేశారు.
అడ్డగోలుగా అక్రమ కట్టడంలో పైసా అద్దె కట్టకుండా ఇన్నేళ్లుగా అక్కడ ఎలా
ఉంటున్నారో చంద్రబాబు చెప్పాలన్నారు. అక్రమాలను తొలగించాల్సింది పోయి అక్కడే
ఎందుకు నివాసం ఏర్పాటు చేసుకున్నారో టీడీపీ బదులివ్వాలన్నారు.
రాజధాని విషయంలో చాలా ఉల్లంఘనలు ఉన్నాయని, రాచరికం, పాలెగాళ్ల రాజ్యం
కాదన్నారు. ఇంటిని కబ్జా చేసి అందులో సిఎంగా పనిచేసిన వ్యక్తి ఉండటం ఎంత వరకు
సమంజసమన్నారు. అధికారం పోగానే ఆ ఇంటిని ప్రభుత్వానికి ఎందుకు అప్పగించలేదని,
ప్రభుత్వానికి చెందిన నివాసమైతే ప్రభుత్వం నుంచి అనుమతి ఎక్కడ తీసుకున్నారో
చెప్పాలన్నారు. లింగమనేని రమేష్ ప్రభుత్వానికి ఎలా ఇచ్చారో రుజువు
చేయాలన్నారు. లింగమనేని రమేష్ భూముల నుంచి అలైన్మెంట్ ఎలా మారిందో
చెప్పాలన్నారు. లింగమనేని రమేష్ తాను ప్రభుత్వానికి అప్పగించానని చెప్పారని
అలాంటి వాటిలో ఇప్పటికీ ఎలా ఉంటున్నారని ప్రశ్నించారు. జగన్ నాలుగేళ్ల కక్ష
సాధింపుకు పాల్పడలేదు కాబట్టే చట్ట ప్రకారం వ్యవహరించామని సజ్జల చెప్పారు.
ప్రభుత్వం అటాచ్ చేయడంలో ఎలాంటి కక్ష సాధింపు లేదన్నారు. ప్రభుత్వం నుంచి
హెచ్ఆర్ఏ తీసుకుంటూ దాని మీద ప్రభుత్వానికి ఖర్చు పెట్టిస్తున్నారని
ఆరోపించారు. కరకట్ట అక్రమాల మీద దేవినేని ఉమా హడావుడి చేసి కబ్జాలు చేశాడని
సజ్జల ఆరోపించారు.