అరుణ్ కుమార్
శీలం ఉదయభాస్కర్ రెడ్డి, శీలం నాగిరెడ్డి, రాయల అనురాధా లపై దాడి చేసిన వారిపై
పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
మహిళలపై తెలుగుదేశం గుండాల దాడి దుర్మార్గం : ఎం ఎల్ సీ డాక్టర్ మొండితోక
అరుణ్ కుమార్
విజయవాడ : గ్రామాల్లో తెలుగుదేశం గుండాలు విద్వేషాలు రెచ్చగొట్టి గొడవలు
సృష్టించి, దాడులకు తెగబడుతున్నారని డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అన్నారు.
వీరులపాడు మండలం బోడవాడ గ్రామంలో గత రాత్రి తెలుగుదేశం గుండాల దాడిలో గాయపడిన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శీలం ఉదయ భాస్కర్ రెడ్డి, శీలం
నాగిరెడ్డి, రాయల అనురాధ లను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు,
శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ఆదివారం నందిగామ ప్రభుత్వ
ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్
కుమార్ మాట్లాడుతూ గ్రామాల్లో అలజడులు సృష్టించి తెలుగుదేశం పార్టీ వారు
దాడులకు తెగబడుతున్నారని, ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో విభేదాలు సృష్టించి
గొడవలు చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం గుండాలు అల్లర్లు చేస్తున్నారని తెలిపారు.
గ్రామంలో సాధారణ మహిళ పై అన్యాయంగా దాడి గురించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి
చెందిన శీలం ఉదయ భాస్కర్ రెడ్డి పెద్ద మనిషిగా మాట్లాడటానికి వెళితే
పెద్దమనుషులను కూడా కొట్టి గాయపరచడం హేయనీయమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్
పార్టీ హయాంలో నందిగామ నియోజకవర్గంలో గ్రామాల్లో ఎటువంటి విభేదాలు లేకుండా, ఏ
టిడిపి నాయకుడి పై దాడులు లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పరిపాలన చేస్తున్నామన్నారు. అయినప్పటికీ తెలుగుదేశం గూండాలు ఈ విధంగా మహిళలపై
దాడులు చేయడం, భయభ్రాంతులకు గురి చేసేలా విధ్వంస వాతావరణాన్ని సృష్టించటం
దుర్మార్గమన్నారు. వైసిపి నాయకులపై, మహిళలపై పై దాడి చేసిన టిడిపి గుండాలపై
పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.