తిరుమల : తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మక కేంద్రంగా మార్చేందుకు టీటీడీ
చేస్తున్న కృషిలో ప్రతి భక్తుడూ భాగస్వాములు కావాలని జస్టిస్ ఎన్వీ రమణ
కోరారు. తిరుమల కొండలు పరమ పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ
ఇంట్లో దేవుడి గదిలాగే భావించి పరిశుభ్రంగా, పవిత్రంగా ఉంచేందుకు కృషి చేయాలని
సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.
జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డితో కలిసి ‘సుందర
తిరుమల- శుద్ధ తిరుమల’ కార్యక్రమాన్ని జెండా ఊపి ఆయన ప్రారంభించారు. తిరుమలను
ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మక కేంద్రంగా మార్చేందుకు టీటీడీ చేస్తున్న కృషిలో
ప్రతి భక్తుడూ భాగస్వాములు కావాలని జస్టిస్ ఎన్వీ రమణ కోరారు. ఇలాంటి అవకాశం
కల్పించాలని చాలా కాలం క్రితమే టీటీడీని కోరానని, భగవంతుడు ఇన్నాళ్లకు
అవకాశం ఇచ్చాడన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఈవో ధర్మారెడ్డి తనను
ఆహ్వానించారని చెప్పారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని..
దీనిలో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు.
అనంతరం తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం
వద్ద పారిశుద్ధ్య కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొని ప్లాస్టిక్
వ్యర్థాలను తొలగించారు.

ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ 1600 మంది పారిశుద్ధ్య కార్మికులు ముందస్తు
సమాచారం లేకుండా సమ్మెలోకి వెళ్లారని చెప్పారు. భక్తులకు ఇబ్బంది కలగకూడదనే
ఉద్దేశంతో తిరుపతి చుట్టుపక్కల మున్సిపల్ కార్పొరేషన్లు, పంచాయతీల నుంచి
పారిశుద్ధ్య కార్మికులను రప్పించి పనులు చేపట్టామన్నారు. అదే స్ఫూర్తితో రెండు
ఘాట్ రోడ్లు, నడక మార్గాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలను శుభ్రం చేసేందుకు
సామూహిక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. తిరుమలకు భక్తులెవరూ
ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకురావొద్దని ఈవో కోరారు.