కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
విజయవాడ : రైల్వే స్టేషన్ల వద్ద టికెట్లకు సంబంధించి చట్ట విరుద్దంగా సాఫ్ట్
వేర్ లు తయారు చేసి, నిర్వహిస్తున్న దళారులను జైల్లో పెట్టాలని, ఈ మేరకు
నిరంతర ప్రచారం చేపట్టాలని రాజ్యసభ సభ్యులు, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా శనివారం ఆయన పలు అంశాలపై
స్పందించారు. స్కూళ్లు, కాలేజీలకు వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు
తల్లిదండ్రులు కలిసి తమ ఇష్టమైన ప్రదేశాలు సందర్శించేందుకు ప్రయాణాలు
చేస్తున్నారని ఫలితంగా రైల్వే టికెట్లకు గిరాకీ విపరీతంగా పెరిగిందని అన్నారు.
దీని నుండి తప్పుడు మార్గంలో లాభం పొందాలని దళారులు మోసాలకు పాల్పడుతూ
చురుకుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. రైల్వే టికెట్లకు సంబంధించి అన్ని రకాల
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు శాశ్వతంగా కట్టడి చేయాలని ఆయన కోరారు.
మే 13న మొట్టమొదటి రాజ్యసభ సమావేశం : రాజ్యసభ మొట్టమొదటి సమావేశం 1952
సంవత్సరం మే 13 న జరిగిందని ఈ తేదీ ప్రత్యేకతను విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించడానికి మరియు జనాదరణ పొందిన లోక్‌సభ ఆమోదించిన
ఏదైనా తొందరపాటు చట్టాన్ని నిరోధించడానికి రూపొందించబడిందని అన్నారు. రాజ్యసభ
అప్పటి నుంచి అసంఖ్యాక ప్రముఖ సభ్యులచే అత్యధిక నాణ్యత గల చర్చలతో కూడిన ఒక
ఛాంబర్‌గా పనిచేస్తుందని అన్నారు.
కర్ణాటకలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు : కర్ణాటక రాష్ట్ర
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు
తెలియజేస్తున్నానని విజయసాయి రెడ్డి అన్నారు. ఎన్నికల్లో భాగంగా ప్రజలకు
ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు.