బొప్పరాజుకి ధన్యవాదాలు
ప్రభుత్వం సొంత వాహనాలు కొనాలి
అద్దె వాహనాల నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలి
ఏపి ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ర్ట అద్యక్షుడు సంసాని శ్రీనివాస రావు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షునికి తిరిగి ఓడి
సౌకర్యం పునరుద్ధరించినందుకు ప్రభుత్వానికి సంఘం తరఫున ఏపి ప్రభుత్వ డ్రైవర్ల
సంఘం రాష్ర్ట అద్యక్షుడు సంసాని శ్రీనివాస రావుహృదయపూర్వక ధన్యవాదాలు
తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర నాయకత్వంలో ఉన్న
విభేదాల కారణంగా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షునికి కల్పించవలసిన ఓడి సౌకర్యం
ప్రభుత్వం గత కొన్ని రోజులుగా నిలుపుదల చేసి ఉన్నారు. ఈ విషయమై రాష్ట్రంలో
ఉద్యోగ సంఘాలను ఐక్యంగా నడిపిస్తున్న బొప్పరాజు ని ఆశ్రయించగా వారు ఆ బాధ్యతను
స్వీకరించి మా నాయకత్వంలో ఉన్న విభేదాలను పరిష్కరించి అన్ని జిల్లాలను ఏకతాటి
పైకి తీసుకు వచ్చారు. తదుపరి బొప్పరాజు అధ్వర్యంలో రాష్ట్ర అద్యక్ష
స్థానానికి ఎన్నికలు నిర్వహించగా కాకినాడ జిల్లాకు చెందిన సంసాని
శ్రీనివాసరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మా
సంఘాన్ని ఏకతాటిపై తీసుకొచ్చి ఓడీ సౌకర్యము పొందడానికి అన్ని విధాల సహకరించిన
బొప్పరాజు కి మా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు
తెలిపారు.
ఎప్పుడు ఎపి జెఏసి అమరావతి లో భాగస్వామ్య పక్షంగా ఉంటూ ముందుకు నడుస్తామని మా
సంఘం పక్షాన తెలిపారు. అంతేకాకుండా ప్రస్తుతము ఉద్యోగుల హక్కుల పోరాటానికి
బొప్పరాజు నాయకత్వములో ఎపి జెఏసి అమరావతి కార్యాచరణ ప్రకటించి గత 64
రోజులుగా చేస్తున్న ఉద్యమంలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం కీలకంగా వ్యవహరిస్తుందని
అదేవిధంగా ఏపీ జేఏసీ అమరావతి తరఫున నిజాయితీగా ఉద్యోగుల కోసం చేస్తున్న ఉద్యమం
ఫలితాలను ఇస్తుందని అందులో భాగంగానే ప్రభుత్వం ఉద్యోగులకు వారి దాచుకున్న
జిపిఎఫ్ సొమ్ములు గాని ఏపీ జి ఎల్ ఐ చెల్లించిదని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల
గ్రాట్యుటీ సరెండర్ లీవులు, పోలీసు సోదరులకు టిఎ లు చెల్లింపులు, ఎపి పబ్లిక్
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో 1158 మంది ఉద్యోగులలో సహా వివిధ జిల్లాలో
పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాలు చెయ్యడం మరియు వారికి ఓవర్ టైం సొమ్ములు
చెల్లింపు, సిపిఎస్ ఉద్యోగుల చందా మరియు ప్రభుత్వ చందా కలిపి వారి ప్రాన్
ఖాతాలకు జమచేయడం, ఒక విడత డి ఏ చెల్లింపు, కేంద్రాలకు అన్ని జిల్లా
కేంద్రాలకు 16% హెచ్ఆర్ఏ ఇవ్వాలన్న డిమాండ్ ను కూడా పరిష్కరిస్తూ పెండింగ్
ఉన్న 8 జిల్లాలకు 16% హెచ్ ఆర్ ఏ ఉత్తర్వులు ఇవ్వడం, మెడికల్ రియంబర్స్మెంట్
తేదీన పొడిగించడం లాంటి అనేక సమస్యలు పరిష్కారం అయ్యాయని తెలిపారు. అయితే
ఉద్యోగుల సరెండర్ లీవులు చెల్లింపు, పీఆర్సీ బకాయిలు చెల్లింపు, డి ఏ బకాయిలు
చెల్లింపు కొత్త పే రివిజన్ కమిషన్ నియామకం, కాంట్రాక్ట్ ఉద్యోగుల
క్రమబద్దీకరణ, సీపీఎస్ రద్దు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంపు లాంటి
అనేక ప్రధానమైన డిమాండ్లను తీరే వరకు ఏపీజెఏసి అమరావతి పోరాటం ఆగదని
పేర్కొన్నారు. సగటు ఉద్యోగి బ్రతుకు ఛిద్రమైపోతున్న ఈ తరుణములో కూడా
పెద్దన్నపాత్ర వహించవలసిన ఒక సంఘం చౌకబారు ప్రకటనలు చేయటం,వెన్నుపోటు పోడవడము
బాధాకరమని.సంఘాన్ని తాకట్టు పెట్టి నిర్వీర్యము చేసిన ఏ నాయకుడిని భావితరాలు
క్షమింపవని,ఉద్యమ ద్రోహులను తోసిరాజని ఉద్యోగుల శ్రేయాస్సే లక్షముగా
ధర్మపోరాటం చేస్తున్న కామ్రేడ్ బొప్పరాజు , ఏపీజెఏసి అమరావతి కి ఎప్పటికి
ఉద్యోగ,పెన్షనేర్స్ ప్రపంచం రుణపడి ఉంటుందని పేర్కొ న్నారు.