సభలను కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ను హైకోర్టు
కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగించేలా ఉందని ఉన్నత
న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ ఏడాది
జనవరి 2న రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 1ను తీసుకొచ్చింది. దాన్ని సవాల్
చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టులో పిల్ వేశారు. ఇదే
జీవోను సవాలు చేస్తూ మాజీ మంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు
రవీంద్ర, ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ
మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి,
ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు
చేశారు. ప్రతిపక్షాలు రోడ్డుపై నిర్వహించే కార్యక్రమాలను జీవో నంబర్ 1 పేరుతో
అడ్డుకునే ప్రమాదం ఉందని, అందువల్ల దాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ
వ్యాజ్యాలపై జనవరి 24న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్
మిశ్ర, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం లోతైన విచారణ జరిపి
తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఆ జీవోను కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.
జీవో నెం.1ను కొట్టివేసిన ఏపీ హైకోర్టు : జగన్ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో
ఎదురుదెబ్బ తగిలింది. జీవో నెం.1 ను కొట్టివేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు
విఘాతంగా ఉందని న్యాయస్థానం పేర్కొంది. రాష్ట్రంలో సభలు, రోడ్‌షోలు, ర్యాలీలపై
ఆంక్షలు విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెం.1 ను తీసుకువచ్చింది. ఈ జీవోను
సీపీఐ నేత రామకృష్ణ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై
శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రామకృష్ణ తరపున లాయర్ అశ్వినీకుమార్
వాదనలు వినిపించారు. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని, ప్రతిపక్షాల గొంతు
నొక్కేందుకే జీవో తెచ్చారని, పోలీస్ యాక్ట్ 30కు భిన్నంగా జీవో నెం.1 జారీ
చేశారని న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న అనంతరం హైకోర్టు
ఈ మేరకు జీవో నెం.1ను కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో రాజకీయ
పార్టీలు రోడ్ షోలు, సభలు నిర్వహించకుండా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో
నెంబర్ 1పై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రాథమిక హక్కులకు విఘాతంగా
ఉందని, రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందన్న పిటిషన్ల న్యాయవాది వాదనలతో
న్యాయస్థానం ఏకీభవిస్తూ ఆ జీవోను కొట్టి వేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. జీవో
నెం.1ను సవాల్ చేస్తూ సీపీఐ నేత రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం
తెలిసిందే.
పిచ్చి కుక్క కాటుకి ఆలస్యంగానైనా చెప్పు దెబ్బ :ఎంపీ రఘురామ కృష్ణంరాజు
హైకోర్టులో జీవో నెం.1 కొట్టివేతపై స్పందించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు
మాట్లాడుతూ పిచ్చి కుక్క కాటుకి ఆలస్యంగానైనా చెప్పు దెబ్బ తగిలిందన్నారు.
ఇకనుంచైనా ప్రభుత్వం తింగరి వేషాలు మానెయ్యాలని సూచించారు. ఈ మధ్య కాలంలో
ఎన్ని అరాచకాలు చేశారోనని, మరో సీఎం ఉంటే ఈపాటికే రాజీనామా చేసేవారని ఎంపీ
రఘురామ వ్యాఖ్యానించారు.