సంగారెడ్డి : సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
నిరుద్యోగుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని మండిపడ్డారు. నష్టపోయిన అన్నదాతకు
సాయం చేయని కేసీఆర్‌కు ఎందుకు ఓటెయ్యాలని ప్రశ్నించారు. పంచాయతీ కార్యదర్శులకు
ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్
నోటి నుంచి అభివృద్ధి అనే మాటే రావడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి
సంజయ్ ఆరోపించారు. నిరుద్యోగుల జీవితాలతో సీఎం ఆడుకుంటున్నారని విమర్శించారు.
అధికారంలోకి వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రతి ఏడాది జాబ్
క్యాలెండర్ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జీతాలు ఇవ్వని
కేసీఆర్‌కు ఓటు ఎందుకు వెయ్యాలని ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లాలో
నిర్వహించిన బీజేపీ నిరుద్యోగ మార్చ్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం,
నిజామాబాద్‌లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని, చివరిగా హైదరాబాద్‌లో
నిరుద్యోగ మార్చ్ చేపడతామని బండి సంజయ్ పేర్కొన్నారు. నష్టపోయిన రైతుకు సాయం
చేయని కేసీఆర్‌కు ఎందుకు ఓటు వెయ్యాలని ప్రశ్నించారు. కేంద్రం చేపడుతున్న
ఉద్యోగ భర్తీల్లో ఎక్కడా అవినీతి లేదని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు
ముఖ్యమంత్రి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాల నుంచి తొలగించినా..
కార్యదర్శులు ఉద్యమం ఆపకండని.. బీజేపీ ప్రభుత్వం వచ్చాక మీకు ఉద్యోగం
ఇస్తుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
“నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ అడుకుంటున్నారు. అధికారంలోకి వచ్చాక 2 లక్షల
ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. జీతాలు
ఇవ్వని కేసీఆర్‌కు ఓటు ఎందుకు వెయ్యాలి. నష్టపోయిన రైతుకు సాయం చేయని
కేసీఆర్‌కు ఎందుకు ఓటెయ్యాలి. కేంద్రం చేపడుతున్న ఉద్యోగ భర్తీల్లో ఎక్కడా
అవినీతి లేదు. పంచాయతీ కార్యదర్శులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని బీజేపీ
రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు.