ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు అసోసియేషన్
అధ్యక్షురాలు మంజులా దేవి
నర్సులకు అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు
విజయవాడ : ప్రపంచ ఆరోగ్యానికి అతిపెద్ద ముప్పు శ్రామిక శక్తి కొరత అని,
నర్సింగ్ లో పెట్టుబడులు పెట్టడం, నర్సుల రక్షణ, భద్రతా పై చర్యలు తీసుకోవాలని
ఇంటర్నేషనల్ కౌన్సిల్ డిమాండ్ చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్
అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు అసోసియేషన్ అధ్యక్షురాలు మంజులా దేవి
అన్నారు. నర్సులకు ఉద్యోగ భద్రత లేదని, రోజూ ఎన్నడో ఒక దగ్గర అన్నివిధాలా
అవమానాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రాధమిక ఆరోగ్య
కేంద్రాల్లో ముగ్గురు స్టాఫ్ నర్సులను 143 జీవో ప్రకారం నియమించడం వల్ల
నర్సులకు అన్యాయం జరుగుతోందని అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని
పురస్కరించుకుని ఆమె మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు నర్సులను వెంటనే
క్రమబద్దీకరించాలని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు అసోసియేషన్
అధ్యక్షురాలు మంజులా దేవి కోరారు. అన్ని జిల్లాలలో స్కూల్ ఆఫ్ నర్సింగ్స్
అరేంజ్ చేయాలని, కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి
చేశారు. 28 నుంచి 30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయినా గాని స్టాఫ్ నర్సు
లకి హెడ్ నర్స్ ప్రమోషన్ల విషయములో డీ ఏం ఈ నుంచి జాప్యం జరుగుతుందని,
ప్రాసెస్ లో ఉన్న గ్రేటు 2 నర్సింగ్ సూపరెంటెండెంట్ టు గ్రేడ్ 1 నర్సింగ్
సూపరెంటెండెంట్ ప్రమోషన్స్ ఫైల్ ని త్వరితముగా మూవ్ చేయాలని కోరారు. ట్రైబల్
ఏరియాలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సెస్ కి హెడ్ నర్సెస్ కి రావాల్సిన అలవెన్సులు
ఇప్పించాలని, వైద్య విధాన పరిషత్తులలో పని చేస్తున్న నర్సులకు నాలుగు నెలల
నుండి జీతాలు రావట్లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ ఎలక్షన్
జరుపుటకు గవర్నమెంట్ అనుమతి పొందినప్పటికి స్పెషల్ అధికారిని నియమించి తేదీని
ఖరారు చేసి ఏర్పాట్లు జరిగేలా చూడాలని కోరారు.అలాగే పాత ఏ.పీ.వి. వి.పి లలో
పనిచేస్తున్న నర్సులకి రెండు నెలలుగా జీతాలు పెండింగ్ లో ఉండిపోయాయని
పేర్కొన్నారు. ఏపీ వివిపి లలో నర్సింగ్ సిబ్బంది 2017 లో బదిలీలు జరిగాయని,
అది పురస్కరించుకొని ఇప్పుడు కూడా సాధారణ బదిలీలు జరపాలని కోరారు