జేకేసి పర్యవేక్షణ కోసం జిల్లాలో పి ఎం యూ యూనిట్, ఆడిట్ టీమ్స్
డివిజన్, మండల స్థాయి లో పర్యవేక్షణ బాధ్యతలు పి ఎం యూ
జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత
రాజమహేంద్రవరం : జగనన్న కు చెబుదాం 1902 ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం చేసే
విధానంలో మరింతగా అధికారులపై బాధ్యత పెరిగిందని, స్పందనకు మరింత మెరుగ్గా జె
కె సి రూపొందించినట్లు జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు.
జిల్లాలో ఇకపై ప్రతి మూడో సోమవారం కలెక్టర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్
సంయుక్తంగా స్పందన కార్యక్రమము నకు ఈనెల నుంచే శ్రీకారం చుడుతున్నట్లు తెలియ
చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం లో విలేఖరుల సమావేశంలో జాయింట్
కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, ఆర్డీవో ఎ.చైత్ర వర్షిణి
లతో కలిసి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత
మాట్లాడుతూ జె కె సి వల్ల పథకాల అమలు చేయడం లో యంత్రాంగం అప్రమత్తమై అర్హులకు
పథకాలు వర్తింపు విధానం మరింత బాధ్యత తో అమలు చేయడం జరగాలని అన్నారు. ఇప్పటి
వరకు ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి మెరుగు పరిచే దిశలో
“జగనన్న కి చెబుదాం” ద్వారా 1902 టోల్ ఫ్రీ నెంబర్ తీసుకుని రావడం
జరిగిందన్నారు. 1902 కి ఫోన్ చేయడం ద్వారా నేరుగా సదరు ఫిర్యాదు ముఖ్యమంత్రి
కార్యాలయం వారికి చేరుతుందని, ఆ అర్జికి వై ఎస్ ఆర్ (యువర్ సర్వీస్
రిక్వెస్ట్) నంబర్ ఇవ్వడం జరుగుతుందని తెలియచేశారు. ఈ ఫిర్యాదు నేరుగా
ముఖ్యమంత్రికి పంపించడం వల్ల వాటిని పరిష్కారం కోసం కింద స్థాయిలో పని
చేస్తున్న అధికారులు మరింత బాధ్యత తో కూడి ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం
చూపడం తో పాటు వాటి పరిష్కారం అప్లోడ్ చెయ్యడం జరుగుతుందని అన్నారు. ఈ
కార్యక్రమానికి స్వయంగా ముఖ్యమంత్రి పేరుతో కూడి పెట్టడం ద్వారా పరిష్కారం
కోసం మరింత జవాబుదారీతనం చూపాల్సి ఉంటుందన్నారు.
ఒకసారి ఆ సమస్య పరిష్కారం చేస్తే వాటి వివరాలు సంబంధిత అర్జి దారునికి పంపి,
వారి అభిప్రాయం తెలుసుకుని, సంతృప్తి కోసం పునః పరిశీలన కోసం పంపడం
జరుగుతుందని అన్నారు. జేకేసి నిరంతర పర్యవేక్షణ కోసం జిల్లా, డివిజన్, మండల
స్థాయి లో ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్, జిల్లా స్థాయి లో ఆడిటింగ్ యూనిట్స్
ఏర్పాటు చెయ్యడం జరుగుతుందని మాధవీలత అన్నారు. రాష్ట్ర స్థాయి లో చేసే విధానం
లో ఇక్కడ కూడా పరిష్కారం చేసిన అర్జిల విషయం లో ప్రజల అభిప్రాయం, సంతృప్తి
స్థాయి తెలుసుకుంటాం అని తెలియ చేశారు. పరిష్కారం చూపే క్రమంలో సంబంధిత
అధికారి చేసే ఎండార్స్ మెంట్ చాలా కీలకం అని తెలిపారు. రెవెన్యూ – లా అండ్
ఆర్డర్ సమస్యలకు ఒకే వేదికపై పరిష్కారం చూపే ప్రయత్నం లో ఇకపై జిల్లాలో ప్రతి
మూడో సోమవారం కలెక్టర్, ఎస్పీ సమక్షం లో స్పందన నిర్వహించనున్నట్లు కలెక్టర్
మాధవీలత తెలియ చేశారు. ఒకవేళ ఆరోజు సెలవు రోజైన, ఎస్పీ, కలెక్టర్ల లో ఏ ఒక్కరూ
అందుబాటులో లేకపోయినా 4 వ వారం నిర్వహిస్తామని తెలిపారు. అయితే ప్రతి సోమవారం
కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన యధావిధిగా జరుగుతుందని అన్నారు. మండల
స్థాయి లో ఇప్పటి వరకు తహశీల్దార్, మండల అభివృద్ధి అధికారులు విడివిడిగా వారి
కార్యాలయాల్లో స్పందన నిర్వహిస్తున్నారని, ఇకపై ఒకే చోట ఇద్దరు కలిసి ప్రజల
నుంచి అర్జీలు తీసుకోవాలని స్పష్టం చేశారు.