వెలగపూడి సచివాలయం : ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీ రావు తప్పుడు విశ్లేషణలు
చేస్తున్నారని సీఎం ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ ఆగ్రహం వ్యక్తం
చేశారు. ఐసీఏఐ నుంచి ఆయనను తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎఫ్ఆర్బీఎం
చట్టానికి లోబడి ప్రభుత్వ రంగ సంస్థలకు పూచీకత్తు ఇవ్వొచ్చని తెలిపారు.
ప్రభుత్వ రంగ సంస్థ అప్పులపై ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తున్నామని స్పష్టం
చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని
మండిపడ్డారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ వారం లేదా పదిహేను
రోజులకోసారి ఏపీలో అప్పులు పెరిగిపోయాయని, ఏదో అయిపోతోందని ఈనాడు చెత్త కథనాలు
వండి వార్చుతోంది. ఇలా వార్తలు రాస్తున్నా జనం నమ్మడం లేదని కొందరికి మేధావి
అంటూ టాగ్ తగిలించి వారితో మాట్లాడిస్తోంది. వారేమో తెలుగుదేశం పార్టీ
అవసరాలకు అనుగుణంగా మాట్లాడి తమ డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. తాజాగా
జీవీ రావుతో మాట్లాడించారు. తెలుగుదేశం పార్టీ ఎలాగైతే విమర్శలు చేస్తోందో అవే
వ్యాఖ్యలు ఈయన చేయడం ద్వారా తన అసలు రంగును ఆయన బయటపెట్టుకున్నారన్నారు.