ఆసక్తికరంగా ఎగ్జిట్ పోల్ ఫలితాలు
బెంగుళూరు : కర్ణాటక ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనే లెక్కలు
వెలువరించాయి ఎగ్జిట్ పోల్స్. రాష్ట్రంలో హంగ్ తప్పదని మెజార్టీ ఎగ్జిట్
పోల్స్ అంచనా వేశాయి. ఈ సర్వేల ప్రకారం ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయంటే?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం
లేదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా
అవతరిస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. రెండో స్థానంలో బీజేపీ, మూడో
స్థానంలో జేడీఎస్ నిలుస్తాయని పేర్కొన్నాయి. కాంగ్రెస్‌కు 94 నుంచి 108 మధ్య
సీట్లు వస్తాయని ‘రిపబ్లిక్ పీ-మార్క్’ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. బీజేపీకి
85 నుంచి వంద స్థానాలు వస్తాయని పేర్కొంది. జేడీఎస్‌కు గరిష్ఠంగా 32 స్థానాలు
రావొచ్చని లెక్కగట్టింది. న్యూస్ నేషన్ సీజీఎస్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం 114
స్థానాలతో భాజపా అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ 86
స్థానాల్లో, జేడీఎస్ 21 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని అంచనా
వేసింది.సువర్ణన్యూస్-జన్‌కీబాత్ ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి 94 నుంచి 117
స్థానాలు వచ్చే అవకాశముందని తెలిపింది. కాంగ్రెస్‌కు 91 నుంచి 106 స్థానాలు,
జేడీఎస్‌కు 14 నుంచి 24 స్థానాలు రావచ్చని లెక్కగట్టింది.