అమరావతి : 2023 వ సంవత్సరపు ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికుల యాత్రికుల
సౌకర్యార్థం, హైదరాబాద్ లేక బెంగళూరు నుండి ప్రయాణం చేయుటకు వీలుగా తగు చర్యలు
చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజంపేట లోక్ సభ సభ్యులు మిథున్ రెడ్డి,
డిప్యూటీ ఛీఫ్ మినిస్టర్ అంజాద్ బాషా , హజ్ కమిటీ చేర్మన్ గౌస్ లాజం, హజ్
కమిటీ డైరెక్టర్ లు బుధవారం భారత మైనార్టీ వ్యవహారాల శాఖా మంత్రి స్మృతి
జుబిన్ ఇరాని ని ఆమె కార్యాలయంలో కలిసి విన్నవించారు. ఈ విషయంలో
సాంకేతికపరమైన అంశాలు ఉన్నందున విమానయాన మంత్రిత్వ శాఖతో చర్చించి తగు నిర్ణయం
తీసుకుంటామని సానుకూలంగా స్పందించడం జరిగిందన్నారు. ఒక వేళ యాత్రికులు విజయవాడ
ఎంబార్కెషన్ పాయింట్ నుండి ప్రయాణం చేయవలసి వస్తే, వారు ఎలాంటి అదనపు మొత్తం
ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఆ అదనపు ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని
స్పష్టం చేశారు.