విశాఖపట్నం : నగర పరిధిలో ప్రజా సమస్యలను డయల్ యువర్ మేయర్ ద్వారా
స్వీకరించిన ఫిర్యాదులను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి నేరుగా ఆయా
ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజా మన్ననలను పొందుతున్నారు. బుధవారం ఆమె సోమవారం
డయల్ యువర్ మేయర్ కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేందుకు నేరుగా 3 వ
జోన్ పరిధిలోని డి ఆర్ డి ఏ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా
నగర మేయర్ మాట్లాడుతూ డయల్ యువర్ మేయర్ లో వచ్చిన ఫిర్యాదులను స్వయంగా
ఆకస్మితక తనిఖీ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈ ప్రాంతంలో పారిశుద్ధ్యం
నిర్వహణ, రోడ్ల అసంపూర్తి నిర్మాణాలపై ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
పారిశుద్ధ నిర్వహణ సరిగాలేదని పారిశుద్ధ నిర్వహణలో అలసత్వం ప్రదర్శించరాదని
శానిటరీ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. అలాగే అసంపూర్ణంగా వేసిన రోడ్లను
పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని మిగిలిన
రోడ్డును వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పర్యటనలో భాగంగా స్థానిక ప్రజల
నుండి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి
జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునే విధంగా జగనన్నకి చెబుదాం అనే
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అందులో అందరూ పాల్గొనాలని విజ్ఞప్తి
చేశారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ విజయలక్ష్మి, ఏ ఎం ఓ హెచ్ సునీల్,
ఇంజనీరింగ్, అధికారులు ప్రజా ఆరోగ్యపు అధికారులు పాల్గొన్నారు.