విశాఖపట్నం : నగర పరిశుభ్రతకు సందర్శకులు, పర్యాటకులు ప్రజా మరుగుదొడ్లను
ఉపయోగించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. బుధవారం ఆమె
బీచ్ రోడ్ లోని వైఎంసి వద్ద రూ.19.86 లక్షలతో ఆధునికరించిన ప్రజా
మరుగుదొడ్లను ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్
మాట్లాడుతూ విశాఖ నగరం ఎంతో సుందరమైన నగరమని, ఇటువంటి మహా సుందర నగరాన్ని
పరిశుభ్రంగా ఉంచేందుకు నగర ప్రజలు పర్యాటకులు సందర్శకులు సహకరించాలని
విజ్ఞప్తి చేశారు. వైఎంసి వద్ద ప్రజల అవసరార్థం ఆధునికరించిన ప్రజా
మరుగుదొడ్లను ప్రారంభించామని, వీటిని ఉపయోగించి నగర స్వచ్ఛతకు
సహకరించాలన్నారు. అలాగే బీచ్ రోడ్లో వ్యర్ధాలు వేయరాదని, పెంపుడు కుక్కలను
రోడ్లపై మలమూత్రాలు వేయకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ
కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ వి సన్యాసిరావు, జోనల్ కమిషనర్
విజయలక్ష్మి, కార్యనిర్వాహక ఇంజనీర్ శ్రీనివాస్, వైయస్సార్సీపి సీనియర్
నాయకులు అక్రమాన్ని వెంకట్రావు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు.