అమరావతి : ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్‌ను
పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వం
విచ్ఛిన్నం చేస్తోందని ఆరోపిస్తూ బుధవారం ఆమరణదీక్షకు కొలికపూడి సిద్ధమయ్యారు.
ఈ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు ఆయనకు నోటీసు అందజేశారు. ఈ క్రమంలోనే
ఉండవల్లి కరకట్ట మీద తుళ్లూరు పోలీసులు కొలికపూడిని అదుపులోకి తీసుకుని
తెలంగాణ సరిహద్దు వైపు వెళ్లారు. ఆర్-5 జోన్ విషయంలో ప్రభుత్వం తన
నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో రాజధాని ప్రాంతంలోని
అబ్బురాజుపాలెంలో డాక్టర్ అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంత దీక్ష
ప్రారంభిస్తున్నట్లు కొలికపూడి శ్రీనివాస్ మంగళవారం వెల్లడించారు. ఈ నేపథ్యంలో
పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొలికపూడిని నూజివీడు, ఖమ్మం మీదుగా
హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ మాట్లాడనీయకుండా కొలికపూడి
శ్రీనివాస్‌పై పోలీసులు ఆంక్షలు విధించినట్లు సమాచారం.