అమరావతి : హజ్ యాత్ర యొక్క విమాన చార్జీల విషయమై, యాత్రికుల ఆందోళనను
దృష్టిలో ఉంచుకుని పొరుగు రాష్ట్రాల యాత్రికులతో సమానంగా సరసమైన విమాన
చార్జీలు నిర్ణయించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు,
సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడం జరుగుతోందనిరాష్ట్ర ఉప
ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి.అంజాద్ భాష చెప్పారు. అందులో
భాగంగా న్యూఢిల్లీలో పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి, విమానయాన శాఖా మంత్రి
జ్యోతిరావు సింధియా ని కలిశారు. ఒక వేళ, విమాన చార్జీలు తగ్గించని పక్షంలో, గత
ఏడాది లాగ, ఆంధ్రప్రదేశ్ హజ్ యాత్రికులకు, హైదరాబాద్, బెంగళూరు
ఎంబార్కెషన్ పాయింట్ ల నుండి, హజ్ యాత్రకు అనుమతినిస్తూ, ఆయా రాష్ట్రాల
యాత్రికులతో సమానంగా విమాన చార్జీలు నిర్ణయించాలని విమానయాన శాఖ మాత్యులను
రాష్ట్ర ప్రభుత్వం తరపున కోరడం జరిగింది. దీనికి మంత్రి స్పందిస్తూ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క అభ్యర్థను మన్నించి అవసరమైన చర్యలు తీసుకొనే
విషయమై పరిశీలిస్తామని చెప్పడం జరిగింది. భారత మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి
స్మృతి జుబిన్ ఇరానిని కలిసి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనను తెలియజేయడం
జరుగుతుంది. హజ్ యత్రికులు విమాన చార్జీల విషయమై ఎలాంటి ఆందోళనకు
గురికావద్దని, రాష్ట్ర ప్రభుత్వం తరపున పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు
మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి, విమానయాన శాఖ మంత్రులతో చర్చలు జరుపుతున్నారు.
ప్రభుత్వం యొక్క కృషి తప్పకుండా సఫలీకృతం అవుతుంది. ఒక వేళ పరిస్థితులు
అనుకూలించకపోతే, మైనార్టీల పక్షపాతి అయిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి
ప్రభుత్వం తప్పకుండా హజ్ యాత్రికులపై ఎలాంటి అదనపు వ్యయ భారం పడకుండా,
హైదరాబాద్ లేక బెంగళూరు ఎంబార్కెషన్ పాయింట్ ల విమాన చార్జీలతో సమానంగా
విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుండి సకల సౌకర్యాలతో హజ్ యాత్ర చేయుటకు వీలు
కల్పించడం జరుగుతుంది.