టోల్ ఫ్రీ నెంబరు 1902
లాంఛనంగా ప్రారంభించనున్న సిఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి : అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అందిస్తోన్న సేవలకు సంబంధించి
వ్యక్తిగత స్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంతృప్త స్థాయిలో పరిష్కారం
చూపేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘జగనన్నకు చెబుదాం’ అనే కొత్త
కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంపు
కార్యాలయం నుంచి సిఎం మంగళవారం ప్రారంభించనున్నారు. ప్రజలు నేరుగా తమ సమస్యను
ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు గానూ టోల్ ఫ్రీ నెంబరు
1902 అందుబాటులో ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యా పరిష్కారం అయ్యే
వరకు ఆ వినతికి ట్రాకింగ్‌ను ఏర్పాటు చేశారు. గతంలో ప్రతి సోమవారం ఇచ్చే
స్పందన అర్జీల తరహాలో ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రికి చెప్పుకునేలా ఈ
కార్యక్రమాన్ని రూపొందించారు. నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి సమస్య వెళ్తుండటంతో
స్పందన కంటే త్వరగా పరిష్కారం చూపే వేదికగా జగనన్నకు చెబుదాం కార్యక్రమం
మారనుంది. ఇందుకోసం సిఎం నేతృత్వంలోని ఒక ప్రత్యేక టీమ్ ఏర్పాటు కానుంది. ఈ
టీమ్ వివిధ ప్రభుత్వ శాఖాధిపతులతో అనుసంధానమవుతుంది. జగనన్నకు చెబుదాంలో
ఎలాంటి వినతి వచ్చినా వెంటనే స్పందించేలా ఈ అనుసంధాన కార్యక్రమాన్ని
కిందస్థాయి వరకు ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంతో ప్రజలకు నేరుగా ముఖ్యమంత్రితో
మాట్లాడే అవకాశం వస్తుంది.
జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఇలా అమలవుతుంది
– ప్రజలు సమస్యను చెప్పేందుకు 1902 టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయాలి
– కాల్ సెంటర్ ప్రతినిధితో సమస్యను చెప్పాలి
– మీ ఫిర్యాదును నమోదు చేసుకుని వెంటనే సమస్యకు సంబంధించి ఒక ఐడి నెంబరును
కేటాయిస్తారు
– ఎప్పటికప్పుడు ప్రజల వినతి స్టేటస్ గురించి ఎస్ఎంఎస్ ద్వారా అప్డేట్ను
చెబుతారు
– సమస్య పరిష్కారం అయ్యాక ప్రభుత్వ సేవలపై ప్రజలు తమ అభిప్రాయాన్ని పంచుకునేలా
ఈ కార్యక్రమాన్ని రూపొందించారు
టోల్ ఫ్రీ నెంబరుకు కాల్ చేయడంతోపాటు వెబ్సైట్, మొబైల్ యాప్‌లో కూడా
సమస్యను విన్నవించేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని రూపొందించారు.
www.jkc.ap.gov.in లో పంపవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్లలో జగనన్నకు చెబుదాం
యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులోంచి కూడా ముఖ్యమంత్రికి సమస్యను
విన్నవించేలా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు.