జగన్ ను కలుసుకున్న సిక్కు మత పెద్దలు * గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలి
* సిక్కు మైనార్టీ విద్యా సంస్థ ఏర్పాటుకు సాయమందిస్తామన్న సీఎం *
గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపుకు అంగీకారం * రాష్ట్రానికి చెందిన
సిక్కు పెద్దలతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమావేశం
గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు
కలుసుకున్నారు. ముఖ్యమంత్రితో వారు పలు అంశాలపై చర్చించారు. వారి విన్నపాల
పట్ల సానుకూలంగా స్పందించిన జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిక్కుల కోసం
ప్రత్యేక కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గురునానక్ జయంతి రోజైన
కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇవ్వడానికి అంగీకరించారు. గురుద్వారాల్లో
పూజారులైన గ్రంధీలకు పాస్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పిస్తామని
చెప్పారు. సిక్కు మైనార్టీ విద్యాసంస్థ ఏర్పాటుకు సాయం అందిస్తామని హామీ
ఇచ్చారు. గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపుకు అంగీకరించారు. సిక్కులు
పారిశ్రామికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రానికి చెందిన సిక్కు పెద్దలతో సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి
సమావేశమయ్యారు. ఏపీ స్టేట్ మైనార్టీస్ కమిషన్ సభ్యుడు జితేందర్జిత్ సింగ్
నేతృత్వంలో కలిసిన సిక్కు పెద్దలు కలిశారు. ఒక శతాబ్దం కిందటి నుంచి సిక్కులు
ఇక్కడ రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతంలో నివాసం ఉంటున్నారని, గ్రామ, వార్డు
సచివాలయాల ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం పథకాలు, ప్రయోజనాలు అందుతున్నాయని
సిక్కు పెద్దలు తెలిపారు. సిక్కులు, వారికి అనుబంధంగా ఉంటున్న వారికోసం ఒక
కార్పొరేషన్ ఏర్పాటు చేసి నవరత్నాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సిక్కు
పెద్దలు కోరారు. సిక్కులకోసం ఒక కార్పొరేషన్ఏర్పాటుకు సీఎం గ్రీన్ సిగ్నల్
ఇవ్వడంతో పాటు గురుద్వారాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వాలన్న
విజ్ఞప్తిపై అంగీకరించారు. గురుద్వారాలపై ఆస్తి పన్ను తొలగించాలని ఆదేశాలు
ఇచ్చారు. గురుద్వారాల్లోని పూజారులైన గ్రంధీలకు, పూజారులు, పాస్టర్లు,
మౌల్వీల మాదిరిగానే ప్రయోజనాలు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. గురునానక్ జయంతి
రోజైన కార్తీక పౌర్ణమి నాడు సెలవుదినంగా ప్రకటించేందుకు సీఎం అంగీకారం
తెలిపారు. ఒక మైనార్టీ విద్యాసంస్థను పెట్టుకునేందుకు అవసరమైన పూర్తి సహాయ
సహకారాలు అందిస్తామని, వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం
కూడా చేస్తామని సీఎం తెలిపారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ఔత్సాహిక
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా సిక్కులకు అవకాశాలు
కల్పించేలా చర్యలు తీసుకోవాలని, వివిధ సామాజిక వర్గాలు నిర్వహిస్తున్న
ఎంఎస్ఎంఈల వ్యాపారాలను పెంచే క్రమంలో ఈ చర్యలు ఉండాలన్న సీఎం. 10 రోజుల్లోగా
ఇవన్నీ కొలిక్కి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షా సమావేశంలో
ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఏ ఎండి
ఇంతియాజ్ పాల్గొన్నారు.