విజయవాడ : వరల్డ్ రెడ్ క్రాస్ డే సందర్భంగా రాజ్ భవన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
గవర్నర్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్ అబ్దుల్ నజీర్
2022-23 సంవత్సరానికి సంబంధించి 26 జిల్లాల్లో రెడ్ క్రాస్ ద్వారా అత్యుత్తమ
సేవలందించిన 11 మందికి గోల్డ్ మెడల్స్ అందజేశారు. ఇందులో కొంతమంది ఐ ఏ యస్ లు
కూడా ఉన్నారు. అందులో భాగంగా నెల్లూరు జిల్లా నుంచి అనేక సేవా కార్యక్రమాలలో
పాలుపంచుకోవడం తోపాటు వ్యక్తిగతంగా 25 లక్షల రూపాయలు డోనేషన్ ను నెల్లూరు
జిల్లా రెడ్ క్రాస్ కు అందించినందున ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి
కి ఈ మెడల్ ను అందించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ రెడ్ క్రాస్
చేస్తున్న సేవలను కొనియాడారు. అలాగే రెడ్ క్రాస్ స్టేట్ ఛైర్మెన్ శ్రీధర్
రెడ్డి, స్టేట్ జనరల్ సెక్రటరీ ఏ కే ఫరీడా రాష్ట్రం లో నెల్లూరు జిల్లా రెడ్
క్రాస్ చేస్తున్న సేవలను గురించి గవర్నర్ కి వివరించారు. భారతదేశంలోనే
నెల్లూరు జిల్లా రెడ్ క్రాస్ అత్యధిక సేవలు నిర్వహించడం అభినందనీయమని గవర్నర్
అబ్దుల్ నజీర్ తెలియజేశారు. భవిష్యత్ లో రెడ్ క్రాస్ మరింత ఉన్నత స్థితిలో
సేవలందించాలని గవర్నర్ ఆకాక్షించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎమ్మెల్సీ
చంద్రశేఖర్ రెడ్డికి మెడల్ అందజేసి ప్రశంసించారు. అనంతరం అవార్డు గ్రహీతలతో
గవర్నర్ గ్రూప్ ఫోటోలు దిగారు.