విజయనగరం : మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన
ఎన్ఐటీ, ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులను స్వస్థలానికి రప్పించే
ఏర్పాట్లు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తెలుగు
విద్యార్థులంతా తమతో టచ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్
జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి స్టూడెంట్స్‌ను లిస్ట్ ఔట్ చేసినట్లు
చెప్పారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘’సివిల్ ఏవియేషన్
మినిస్టర్‌తో మాట్లాడి విద్యార్థులను రాష్ట్రానికి కి రప్పించే ఏర్పాటు
చేస్తున్నాం. విద్యార్థులు కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్ పెట్టాం. విద్యార్థులు
వివరాలు నమోదు చేసుకుంటే వాళ్లని తీసుకొచ్చే ఏర్పాటు చేస్తాం. తల్లిదండ్రులు,
విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. సుమారు 100 వరకు మణిపూర్ విద్యార్థులు
ఇప్పటివరకు రిజిస్టర్ చేసుకున్నారు. ఇంకా 50 మంది వరకు ఉండచ్చు అని మా అంచనా.
150 మందికి సరిపడే విమానం ఏర్పాటు చేశాం’’ అని బొత్స వివరించారు. అలాగే, అకాల
వర్షాల నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పెద్దగా పంట నష్టం జరగలేదని బొత్స తెలిపారు.
ప్రభుత్వం ప్రతి జిల్లాకి స్పెషల్ ఆఫీసర్‌ను నియమించిందని, జిల్లా వారిగా
సమీక్ష చేసి పంట నష్టాలు నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ధాన్యం
కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడుకు
పంట నష్టాల విషయంలో బురద జల్లడం అలవాటే అని బొత్స మండిపడ్డారు. ఇలాంటి
విమర్శలు పట్టించుకునేది లేదని తేల్చిచెప్పారు. పంట నష్టాలు వచ్చిన ప్రతి
రైతుని ఆదుకుంటామని స్పష్టం చేశారు.