ప్రతి నగరాల కులస్తుల గుండెలో వుండే వ్యక్తి వెలంపల్లి – కొరగంజి భాను
అభివృద్ధిని చూడలేని వ్యక్తి పోతిన మహేష్ – శీరం వెంకట్రావ్
విజయవాడ : స్థానిక భవానిపురం లో గల ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యాలయం నందు ఆదివారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశం ఈ సమావేశంలో
శ్రీ శైలం దేవస్థానం బోర్డ్ సభ్యులు గురుమహంత్ మహేష్ మాట్లాడుతూ పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పై పోతిన మహేష్ ఉత్తర కుమారా
ప్రగాల్బలు పలుకుతున్నారన్నారు. శ్రీ శైలం నగరాల కుల మండపానికి స్థలం ఇప్పించి
నన్ను బోర్డ్ మెంబర్ గా వేయించిన వ్యక్తి వెలంపల్లి అని అన్నారు. రాష్ట్ర బీసీ
సెల్ కార్యదర్శి మజ్జి శ్రీను మాట్లాడుతూ నగరాల పక్షపాతి వెలంపల్లి శ్రీనివాస్
అని అన్నారు.నగరాల అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తి పోతిన మహేష్ అని అన్నారు.
నగరాల కళ్యాణ మండపం వాస్తు దోషం వుందని కమిటీ వారు అడిగితే ట్రాన్స్ఫార్మర్
తియించిన వ్యక్తి వెలంపల్లి అని అన్నారు. నగర మేయర్ దుర్గ గుడి
చేర్మెన్,నగరాల కార్పొరేషన్ శ్రీ శైలం బోర్డ్ మెంబర్ పదవులు ఇచ్చిన నగరాల కు
మంచి చేసిన వ్యక్తి పై అవాకులు చవాకులు పేలితే సహించేదే లేదన్నారు. నగరాల
కార్పొరేషన్ డైరెక్టర్ శీరం వెంకట్రావు మాట్లాడుతూ అభివృద్ధిని చూసి ఓర్వలేని
వ్యక్తి పోతిన మహేష్ అని అన్నారు.పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ది
పనులు చేస్తున్న వెలంపల్లినీ విమర్శించే స్థాయి అర్హత మహేష్ కి లేదన్నారు.
నగరాలు మహేష్ కి సరైన రీతిలో బుద్ది చేపడనికి సిద్దంగా వున్నారన్నారు. దుర్గ
కో ఆపరేటివ్ బ్యాంక్ మాజీ చేర్మెన్ కొరగంజీ భాను మాట్లాడుతూ వెలంపల్లి
శ్రీనివాసరావు అనే వ్యక్తి నగరాల గుండెలలో వుండే వ్యక్తి అని అన్నారు. ఆయన
అనేక మంది నగరాలకు మంచి చేశారని అన్నారు. మహేష్ నగరాలకు ఏమి మంచి చేశారో
చెప్పాలని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పిళ్ళ జగ్గు,పణుకు ఫణి తదితరులు
పాల్గొన్నారు.