విజయవాడ : పదవ తరగతి పరీక్షల్లో భవానిపురం లోని నేతాజీ హై స్కూల్ విద్యార్థులు
మంచి ప్రతిభను కనబరిచారు. శనివారం వెలువడిన పదవ తరగతి పరీక్షల ఫలితాల్లో
నేతాజీ హై స్కూల్ కు చెందిన ఎస్ కె. సమర్ సాదియా 600 మార్కులకు గాను 582
మార్కులను, ఎన్. హర్షిత 581 మార్కులను, ఎస్.కె సమీరా 575 మార్కులను, ఎస్.కె
రహీముల్లా 567 మార్కులను, బి.భావన 560 మార్కులను సాధించారు. ఇదే విధంగా 500
మార్కులు పైబడి 25 మంది విద్యార్థులు, 550 మార్కులకు పైన 10మంది విద్యార్థులు
మార్కులను సాధించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ కే. తిరుపతిరెడ్డి,
అరుణ కుమారి మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో ఇంతటి ఘనవిజయాన్ని సాధించినందుకు
విద్యార్థినీ విద్యార్థులను అభినందించారు. మంచి ఉత్తీర్ణతను సాధించడానికి కృషి
చేసిన ఉపాధ్యాయులను కొనియాడారు. తమ పాఠశాలకు సహకారం అందిస్తున్న
తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను
సాధిస్తామని పేర్కొన్నారు.