ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు అసోసియేషన్
అధ్యక్షురాలు మంజుల దేవి
విజయవాడ : కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్
గవర్నమెంట్ నర్సస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు అసోసియేషన్ అధ్యక్షురాలు
మంజుల దేవి కోరారు. ఈమేరకు ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనార్థం వచ్చిన
ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజనికి మంజుల దేవి వినతి పత్రం
అందజేశారు. అన్ని జిల్లాలలో స్కూల్ ఆఫ్ నర్సింగ్స్ అరేంజ్ చేయాలని,
కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులను రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. 28 నుంచి
30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ అయినా గాని స్టాఫ్ నర్సు లకి హెడ్ నర్స్
ప్రమోషన్ల విషయములో డీ ఏం ఈ నుంచి జాప్యం జరుగుతుందని, ప్రాసెస్ లో ఉన్న
గ్రేటు 2 నర్సింగ్ సూపరెంటెండెంట్ టు గ్రేడ్ 1 నర్సింగ్ సూపరెంటెండెంట్
ప్రమోషన్స్ ఫైల్ ని త్వరితముగా మూవ్ చేయాలని కోరారు. ట్రైబల్ ఏరియాలో
పనిచేస్తున్న స్టాఫ్ నర్సెస్ కి హెడ్ నర్సెస్ కి రావాల్సిన అలవెన్సులు
ఇప్పించాలని, వైద్య విధాన పరిషత్తులలో పని చేస్తున్న నర్సులకు నాలుగు నెలల
నుండి జీతాలు రావట్లేదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ ఎలక్షన్
జరుపుటకు గవర్నమెంట్ అనుమతి పొందినప్పటికి స్పెషల్ అధికారిని నియమించి తేదీని
ఖరారు చేసి ఏర్పాట్లు జరిగేలా చూడాలని కోరారు. గవర్నమెంట్ హాస్పిటల్స్
పర్యటనలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని కలిసి ఈ సమస్యలను
వివరించి లిఖిత పూర్వకముగా వినతి పత్రాన్ని అందించగా వారు సానుకూలంగా
స్పందించారని ఆనందం వ్యక్తం చేశారు.