అమరావతి : అన్యాయమైన డిమాండ్‌తో కొందరు పిటిషన్ వేశారని, హైకోర్టు తీర్పు
చెంపపెట్టులాంటిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సామాజిక అసమతుల్యత అనేవారికి ఈ తీర్పు చెంపదెబ్బ. న్యాయం ఎలా ఉండాలో కోర్టు
తీర్పు అలా ఉంది. పేదలకు అమరావతిలో నివసించే అవకాశం లేదనడం దుర్మార్గం. అలాంటి
ప్రయత్నం చేయడమే దుస్సాహసం. త్వరలోనే ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తాం’’ అని సజ్జల
అన్నారు. ‘‘అకాల వర్షాలు పడితే పంట నష్టం జరుగుతుంది. అధికారులు పంట నష్టం
అంచనా వేస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్
ఆదేశాలు ఇచ్చారు. రైతులను ఆదుకునే అన్ని చర్యలు జరుగుతున్నాయి. నాలుగేళ్లుగా
సీఎం జగన్ ఎప్పటికప్పుడు నష్టపరిహారం అందించారు. 2014-19 మధ్య నష్టపరిహారం ఎలా
ఇచ్చాడో చంద్రబాబు చెప్పాలి. ఓ సీఎం ఎలా పని చెయ్యాలో రోల్ మోడల్ జగన్. అధికార
యంత్రాంగానికి ఇబ్బంది కలుగకుండా సీఎం ఇక్కడి నుంచి ఆదేశాలు ఇస్తున్నారని
సజ్జల పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు పబ్లిసిటీ పర్యటనలు చేసి అధికార యంత్రాంగం
రైతులను ఆదుకోకుండా చేసేవాడు. ప్రభుత్వం చెయాల్సిన దానిలో 100 శాతం
చేస్తున్నాం. అమరావతి నగరం నిర్మాణం కోసం అడుగు ఇప్పుడు పడుతుంది. కార్మికులు,
శ్రామికులు లేని ఏ నగరం ఉండదు. అన్ని వర్గాల వాళ్లు అక్కడ ఉండాలని మా నిర్ణయం.
పేదలు ఉండొద్దు అని అనడం పాపం.. నేరం. అలాంటి పాపం చేసిన వాళ్లకి హైకోర్టు
బుద్ది చెప్పింది. వర్షాలు పడితే ఎక్కడైనా జలమయం అవుతుంది. హైదరాబాద్, ఢిల్లీ
అయినా వర్షం నీరు ఉంటుంది. అమరావతిలో వర్షం పడితే నీళ్లు నిలవడం లేదా..?
వర్షాలు పడితే జగనన్న కాలనీల్లో నీళ్లు నిలవడం సహజం’’ అని సజ్జల
రామకృష్ణారెడ్డి అన్నారు.