విజయవాడ : సాక్షర భారత్లో పనిచేస్తూ టీడీపీ ప్రభుత్వ హయాంలో తొలగించిన మండల
సమన్వయకర్తలు 500 మందిని స్వచ్చాంధ్ర కార్పొరేషన్లో మండల సమన్వయకర్తలుగా
తిరిగి ఉద్యోగం ఇచ్చినందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సాక్షర భారత్ మండల
కోఆర్డినేటర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సిద్దారెడ్డి, ప్రధాన కార్యదర్శి
సుబ్బారావు, ప్రసాద్, బాపేశ్వరరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిసి
కృతజ్ఞతలు తెలిపారు. సర్వే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సుమారు 11 వేల మంది
గ్రేడ్ 3 సర్వేయర్లను గ్రేడ్ 2 సర్వేయర్లుగా అప్గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు
జారీ చేసినందుకు ఏపీ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు సీఎం క్యాంప్
కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ గవర్నమెంట్
ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ జేఏసీ
చైర్మన్ విఎస్ దివాకర్, సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.
చిరంజీవి రావు సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.