పాలకొండ : తిరుమల తిరుపతి దేవస్థానం నిధులు సుమారు 10 కోట్ల రూపాయలు వ్యయంతో
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట గ్రామంలో నూతనంగా
నిర్మించిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గురువారం
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ప్రారంభించారు.
ప్రారంభోత్సవ ఆహ్వానం మేరకు బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు శంబంగి వెంకట చిన
అప్పలనాయుడు హాజరై వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ
కార్యక్రమంలో విజయనగరం జిల్లా పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్ ,పాలకొండ
ఎమ్మెల్యే కళావతి,కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి,రాజాం ఎమ్మెల్యే
కంబాల జోగులు గారు,పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్
రాజు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు,ప్రజాప్రతినిధులు
పాల్గొన్నారు.