విజయవాడ : ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చి, ఆ ప్రాంత సమగ్రాభివృద్ధికి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాటలు వేస్తున్నారని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్
సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. పలు అంశాలపై ఆయన
బుధవారం సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంచను
నెరవేరుస్తూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రాయ పనులుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్
రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు.అలాగే విశాఖపట్నం మధురవాడలో ఆదానీ గ్రూపు
రూ.21,844 కోట్లతో వైజాగ్ టెక్ పార్కు లిమిటెడ్ పనులకు శంకుస్ధాపన చేశారన్నారు…
ఏపీలో వ్యవసాయ రంగం కొత్తపుంతలు
ఏపీలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఒకే చోట రైతుల అవసరాలన్నీ తీర్చేలా సేవలు
అందించడం దేశంలోనే తొలిసారి అని నీతి ఆయోగ్, యూఎన్ డీపీ(యునైటెడ్ నేషన్స్
డెవలప్ మెండ్ ప్రొగ్రామ్) ప్రశంసించిందని చెప్పారు. ఆర్బీకేలు వ్యవసాయ రంగంలో
సమూల మార్పులు తీసుకోస్తున్నాయని కొనియాడిందని వెల్లడించారు. రైతుల అవసరాలన్నీ
తీర్చే వేదికగా ఆర్బీకేలు నిలిచాయని చెప్పారు.
ఆపరేషన్ కావేరి విజయవంతం కావడం గర్వంగా వుంది.
సూడాన్ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడానికి మన సాయుధ బలగాలు నిర్వహించిన
ఆపరేషన్ కావేరి విజయవంతం కావడం గర్వంగా ఉందని చెప్పారు.మన విదేశీ వ్యవహారాల
మంత్రిత్వ శాఖ అధికారులు ప్రదర్శించిన తీరును ఈ సందర్భంగా ఆయన ప్రశంసించారు.