చేతుల మీదుగా ప్రత్యేక పూజలు
విజయవాడ : శ్రీ దేవీ కరుమారి అమ్మన్ సన్నిధిలో జరుగుతున్న సహస్ర చండీ యాగం
బుధవారం పూర్ణాహుతి తో ముగిశాయి. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠం
పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు
నిర్వహించారు. ఆయన చేతులు మీదుగా ఈ మహా కుంభాభిషేకం కార్యక్రమ క్రతువు
ముగిసింది.ఏప్రిల్ 27 నుండి మే 3 తేదీ వరకు వారంరోజులుగా జరిగిన సహస్ర చండి
యాగంలో శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ
బృందం 80 మంది ఋత్వికులు చేతులు మీదుగా ప్రత్యేకంగా నిర్మించిన రెండు యాగ
శాలల్లో ఈ క్రతువుని పూర్తి చేశారు.ఈ సందర్భంగా మహాపూర్ణాహుతి, మండప
ఉద్వాసనలు,మహా కుంభాభిషేకము,అంగరంగ వైభవంగా జరిగాయి. పండితులు వేద ఆశీర్వచనాలు
పలికారు. పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆధ్వర్యంలో జరిగిన ఈ
వేడుకల్లో పెదపులిపాకలోని శ్రీ రాజరాజేశ్వరిదేవి దేవస్థానం పీఠాధిపతులు
శ్రీశ్రీశ్రీ వాసుదేవానందగిరి స్వామి, మాస్ట్రో గజల్ శ్రీనివాస్, ఉత్సవ కమిటీ
అధ్యక్షులు,రాష్ట్ర పైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి, ఎస్
ఏ ఎస్ కళాశాల కార్యదర్శి రాంపిళ్ల జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీ దేవీ కరుమారి అమ్మన్ వారికి శ్రీ కాణిపాకం దేవస్థానం తరపున శేషవస్త్రం
సమర్పణ
సహస్ర చండీ యాగం జరుగుతున్న శ్రీ దేవి కరుమారి అమ్మన్ కి బుధవారం శ్రీ
కాణిపాకం దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ మోహన్ రెడ్డి ఆలయ మర్యాదలతో
శేషవస్త్రం సమర్పించారు.అయనకు అమ్మవారి ఆలయ మర్యాదలతో స్వాగతం
పలికారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోహన్ రెడ్డి తో పాటుగా సహస్ర చండీ
యాగంకి అన్నదానం కోసం 350 బస్తాలు బియ్యం విరాళంగా అందించిన ప్రముఖ
పారిశ్రామిక వేత్త కుంట ముక్కల కుమార్, లఖంరాజు సునీత, కోడూరి సుందరి, చలవాది
ప్రకాష్, ఉత్సవ కమిటీ సభ్యులు జ్ఞానేశ్వర్, వై వి నాగేందర్, ఫణి కుమార్,
చంద్రకళ, బత్తుల వెంకటేశ్వరరావు, ఉభయ దాతలు, తదితరులు పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా జరిగిన ఈ సహస్ర చండీ యాగం ముగింపు సందర్భంగా వేలాదిమందికి
అన్నదానం చేశారు