వెలగపూడి : ఆర్-5 జోన్ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
అమరావతి రైతులు, ప్రభుత్వం తరఫున వాదనలు విన్న ధర్మాసనం ఈ అంశంపై తీర్పును
రిజర్వులో ఉంచింది. ఎల్లుండి ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించింది. రాష్ట్రంలో ఏ
ప్రాంతానికి చెందిన పేదలకైనా రాజధాని అమరావతిలో 1134 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు
ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు (550.65ఎకరాలు),
ఎన్టీఆర్ (583.93 ఎకరాలు) జిల్లా కలెక్టర్లకు భూబదలాయింపు నిమిత్తం సీఆర్డీఏ
కమిషనర్‌కు అనుమతిస్తూ పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి
ఈఏడాది మార్చి 31న జీవో 45 జారీచేశారు. ఆ జీవోను సవాలు చేస్తూ రాజధాని ప్రాంత
రైతులు యు.శివయ్య, కె.రాజేశ్, బెజవాడ రమేశ్‌బాబు, ఆలూరి రాజేశ్, కుర్రా
బ్రహ్మ, కట్టా రాజేంద్రవరప్రసాద్ హైకోర్టులో వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు
చేశారు. ఆయా పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళ, బుధవారాల్లో విచారణ చేపట్టి
తీర్పును రిజర్వ్ చేసింది.