అమరావతి : టీడీపీ ప్రభుత్వంలో కాపులపై అనేక కేసులు నమోదు చేశారని.. కేసు
కొట్టివేయడం చంద్రబాబు, రామోజీ భరించలేకపోతున్నారని ఏపీ జలవనరులశాఖ మంత్రి
అంబటి రాంబాబు దుయ్యబట్టారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ
కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ,టీడీపీ హయాంలో కాపులను
హింసించారని.. కాపు ఉద్యమంలో కాపు నేతలందరిపై 69 కేసులు చంద్రబాబు
పెట్టించారని మండిపడ్డారు. ‘‘ముద్రగడ, దాడిశెట్టి రాజా సహా అనేక మందిపై అక్రమ
కేసులు పెట్టారు. కాపులపై అన్యాయంగా పెట్టిన కేసులను కోర్టు కొట్టివేసింది.
రాజకీయ కక్షతోనే చంద్రబాబు కేసులు పెట్టించారు. చంద్రబాబు ప్రోద్భలంతోనే
వంగవీటి మోహనరంగా హత్య జరిగింది. చంద్రబాబు హయాంలో కాపులపై పెట్టిన అన్ని
కేసులను కేవలం ఒకే ఒక్క జీవోతో సీఎం జగన్ ఎత్తివేశారు. కాపులను హింసంచడమే
టీడీపీ పని. టీడీపీ కాపు వ్యతిరేక పార్టీ. కాపుల విషయంలో చంద్రబాబు సైకోలా
వ్యవహరించారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘‘పవన్ కల్యాణ్ ఒక
అజ్ఞాని. ఆయన చంద్రబాబుతో కలిసినా కాపులు కలవరు. కాపులను సర్వనాశనం చేయడమే
టీడీపీ లక్ష్యం. పవన్ కల్యాణ్‌కు అసలు చరిత్రే తెలియదు కాపులతో చంద్రబాబు
పల్లకీ మోయించాలని పవన్ చూస్తున్నాడు. ప్యాకేజీ తీసుకుని కాపులను బాబుకు
తాకట్టు పెట్టాలని పవన్ యత్నం. పవన్ కల్యాణ్ వైఖరి పట్ల కాపులంతా
అప్రమత్తంగా ఉండాలి. ఒక పార్టీలో ఉండి వేరే పార్టీవారితో కలవడం పవన్‌కు
అలవాటే. కాపులను అణచివేసిన పార్టీ టీడీపీ’’ అని మంత్రి అన్నారు.