విజయవాడ : శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం వద్ద ఆదివారం శ్రీ శివపార్వతుల
కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలోని సి వి ఆర్ ప్లై
ఓవర్ బ్రిడ్జీ పక్కనున్న శ్రీ దేవీ కరుమారి అమ్మన్ శక్తి పీఠం పీఠాధిపతులు
శ్రీశ్రీశ్రీ కరుమారి దాసు ఆధ్వర్యంలో ఏప్రిల్ 27 నుండి జరుగుతున్న సహస్త్ర
చండీ యాగంలో భాగంగా ప్రతిరోజూ ఒక్కో దేవుళ్ల కు కళ్యాణాలు జరుగుతున్న విషయం
తెల్సిందే. ఈ వేడుకల్లో భాగంగా కల్యాణ వేదికపై ఆదివారం శివపార్వతుల కల్యాణం లో
ఎందరో భక్తులు ఉభయ దాతలు పాల్గొన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో వేదమంత్రాలు
మార్మోగాయి. వేలాదిమంది భక్తులు ఈ వేడుకలు తిలకించి పులకించారు. అలాగే మహిళా
భక్తులు కుంకుమ పూజల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం వేలాదిమందికి అన్నదానం
నిర్వహించారు. మాస్ట్రో గజల్ శ్రీనివాస్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ పైబర్
నెట్ కార్పొరేషన్ చైర్మన్, చండీయాగం ఉత్సవ కమిటీ అధ్యక్షులు పునూరు గౌతమ్
రెడ్డి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వైసీపీ
నగర మహిళామాజీ కన్వీనర్ లఖంరాజు సునీత సాంసృతిక కళావేదికకు వ్యాఖ్యాతగా
వ్యవహరిస్తున్నారు. దుర్గమ్మ దేవస్థానం స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద
శర్మ నేతృత్వంలో 80 మంది ఋత్వికుల యాగ క్రతువుని దిగ్విజయంగా
నిర్వహిస్తున్నారు.