విజయవాడ : సహస్ర చండీయాగం సందర్భంగా శ్రీదేవి కరుమారి అమ్మన్ శక్తిపీఠం ను
శనివారం సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తులు శంకర్రావు, మానవేంద్రరాయ్
దర్శించుకున్నారు. న్యాయమూర్తులకు శక్తిపీఠం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ కరుమారి
దాసు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. సహస్ర చండీయాగం
విశిష్టతను వారికి ఆయన వివరించారు. సకల మానవాళి సౌభాగ్యం కోసం ఎంతో మహత్తరమైన
ఈ సహస్ర చండీయాగమును నిర్వహిస్తున్నమని చెప్పారు. కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ
విజయేంద్ర సరస్వతి వారి సూచనలు సలహాల ప్రకారం ఈ సహస్ర చండీయాగమును
నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా పలువురు ప్రముఖులు శక్తిపీఠంను సందర్శించి
అమ్మవారిని దర్శించుకున్నారు.అలాగే పూజ్య శ్రీశ్రీశ్రీ వాసుదేవనంద గిరిస్వామి
ప్రవచనం భక్తులను ఆకట్టుకున్నాయి. అనూష నాయుడు శిష్య బృందం సంప్రదాయ నృత్యాలు
అలరించాయి. టీడీపీ నాయకులు ఎమ్ ఎస్ బేగ్, సారిపల్లి రాధాకృష్ణ, దనేకుల వెంకట
సుబ్బారావు, నున్న పోలీస్ స్టేషన్ సి ఐ కాగిత శ్రీనివాసరావు, తదితరులు
అమ్మవారి ని దర్శించుకున్నారు.