అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో యధావిధిగా పనిచేయనున్న కేంద్రాలు * రాష్ట్ర
సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణామండలి చైర్మన్
చదలవాడ నాగరాణి
విజయవాడ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో వివిధ
కోర్సుల ప్రవేశానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే పాలిటెక్నిక్ ఉమ్మడి
ప్రవేశ పరీక్ష “పాలీసెట్ 2023” కు ఆదివారం కూడా దరఖాస్తులు స్వీకరిస్తారని
రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణామండలి
చైర్మన్ చదలవాడ నాగరాణి తెలిపారు. సెలవు దినం అయినప్పటికీ రాష్ట్రంలోని అన్ని
పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిసెట్ దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు యధావిధిగా
పనిచేస్తాయన్నారు. మే 10 వ తేదిన ప్రవేశ పరీక్ష జరగనుండగా, ఏప్రిల్ 30
ఆదివారమే దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీగా ఉందని, ఎట్టి పరిస్ధితులలోనూ
పొడిగింపు ఉండబోదని పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరం కోసం పాలీసెట్
పరీక్ష వ్రాసేందుకు 10వ తరగతి / తత్సమాన పరీక్ష పాసైన విద్యార్ధులు, 2023
ఏప్రిల్ లో పరీక్షకు హాజరైన విద్యార్ధులు అర్హులన్నారు. ఓసి, బిసి అభ్యర్ధులకు
దరఖాస్తు ఫీజు రూ. 400 కాగా, ఎస్సి, ఎస్టి అభ్యర్ధులకు రూ.100గా
నిర్ణయించామన్నారు. ఆన్ లైన్ లో సైతం ఆదివారం సాయంత్రం ఐదు గంటల వరకే అవకాశం
ఉంటుందని చదలవాడ నాగరాణి వివరించారు