విశాఖపట్నం : ముఖ్యమంత్రి జగన్ విశాఖ పర్యటన ఖరారైంది. మే 3న ఉదయం 9.20
గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకుంటారు. 9.30 గంటలకు
విమానాశ్రయం నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి భోగాపురం మండలం ఎ.రావివలస
గ్రామానికి వెళ్లనున్నారు. అక్కడ భోగాపురం విమానాశ్రయానికి శంకుస్థాపన చేసి,
అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.20 గంటలకు హెలికాప్టర్లో
బయలుదేరి 1.40 గంటలకు విశాఖ మధురవాడ ఐటీ హిల్-3 వద్దకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 2.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత ఐటీ
హిల్-4 వద్ద అదానీ గ్రూపు ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న వైజాగ్ టెక్‌పార్కు
లిమిటెడ్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. ఫొటో ఎగ్జిబిషన్‌ను
పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.50 గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి రుషికొండ
సమీపంలోని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నివాసానికి చేరుకుంటారు. ఇటీవల వివాహమైన
ఎంపీ కుమారుడు దంపతులను అభినందిస్తారు. సాయంత్రం 4.20 గంటలకు ఎంపీ నివాసం
నుంచి బయలుదేరి ఐటీ హిల్ హెలిప్యాడ్ వద్దకు 4.35 గంటలకు చేరుకుంటారు. అక్కడ
విశాఖ నాయకులను సీఎం కలవనున్నారు. సాయంత్రం 5 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి
5.20 గంటలకు విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.30 గంటలకు ప్రత్యేక విమానంలో
బయలుదేరి విజయవాడకు పయనమవుతారు.