విజయవాడ వేదికగా ఘనంగా గ్లోబల్ ఫుడ్ భాస్కెట్ 2023 సదస్సు
విజయవాడ : చిన్న, మధ్యతరహా పరిశ్రమల ప్రోత్సాహంతోనే పారిశ్రామిక రంగం
అభివృద్దిని సాధిస్తుందని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ
(డిజైన్, మాన్యుప్యాక్చరింగ్ – కర్నూలు) డైరెక్టర్ అచార్య డివిఎల్ఎన్
సోమయాజులు అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక ఫంక్షన్ హాలులో
ఎంఎస్ ఎంఇ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్లోబల్ ఫుడ్ బాస్కెట్
2023 వర్క్ షాపులో గ్లోబల్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ అండ్ అడ్వాన్స్డ్
సిస్టమ్స్ – ఫుడ్ వాల్యూ చైన్’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆయన కీలకోపన్యాసం
చేసారు. ఈ సందర్భంగా అచార్య సోమయాజులు మాట్లాడుతూ అత్యాధునిక సాంకేతిక ఆలంబనగా
ఆహర పరిశ్రమ కొత్త రూపును సంతరించుకుంటుందన్నారు. విలువ అధారిత ఆహార
ఉత్పత్తులతో మంచి అదాయం గడించవచ్చన్నారు. తినటానికి సిద్దంగా ఉన్న ఆహారానికి
మంచి గిరాకీ ఉందని , ప్రత్యేకించి రసాయన రహిత అర్గానిక్ ఫుడ్ అంతర్జాతీయ
ఆమోదాన్ని పొందిందని వివరించారు. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్ మేషన్
టెక్నాలజీ (డిజైన్, మాన్యుప్యాక్చరింగ్ – కర్నూలు) రిజిస్ట్రార్ కె గురుమూర్తి
మాట్లాడుతూ మెరుగైన ప్యాకేజింగ్ ద్వారా వినియోగదారులను ఆకర్షించవచ్చన్నారు.
చిన్న మధ్య తరహా పరిశ్రమల వారు తమ ఉత్పత్తుల పరంగా నవ్యత, నాణ్యతతో పాటు
అంతర్జాతీ ప్రమాణాల మేరకు ప్యాకింగ్ చేయాలన్నారు. వెనుకబడిన, అభివృద్ది
చెందిన ప్రాంతాల అనుసంధానం ద్వారా ఆహారం, అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహించటం అనే
అంశం పై జరిగిన చర్చకు గురుమూర్తి సమన్వయకర్తగా వ్యవహరించారు. కర్నూలు ఇండియన్
ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ (డిజైన్, మాన్యుప్యాక్చరింగ్ )
సంస్ధను సాంకేతిక విద్య పరంగా ఉన్నత ప్రమాణాలతో కూడిన సంస్ధగా
తీర్చిదిద్దుతున్నందుకు అచార్య సోమయాజులు ఈ సందర్భంగా ప్రత్యేక అవార్డు
అందుకున్నారు. ఉదయం జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంఎస్ఎంఇసిసి ఛైర్మన్
దేవరాజ్ దాసరి, డబ్య్లుఎఎస్ఎంఇ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సంజీవ్
లాయెక్ తదితరులతో పాటు, విజయవాడ సెంట్రల్ ఎంఎల్ఎ మల్లాది విష్ణు తదితరులు
పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆహార ఉత్పత్తుల ప్రదర్శన ఆహుతులను
అలరించింది.