వైసీపీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “జగనన్న మీరే మా
నమ్మకం – మీరే మా భవిష్యత్”కార్యక్రమం జయప్రదంగా జరుగుతున్న సందర్భంగా ఈనెల 29
శనివారం ఉదయం 9 గంటలకు భవానిపురం ఆకుల రాజేశ్వరరావు వీధి లో ఉన్న మా
కార్యాలయం నుండి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల
శ్రీనివాస్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలుతగా తమ కార్యాలయం
నుండి ర్యాలీగా బయలుదేరి స్వాతి ధియేటర్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ జిల్లా
వైఎస్సార్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్సీపి ఎన్టీఆర్ జిల్లా
అధ్యక్షులు, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు , సెంట్రల్ ఎమ్మెల్యే
మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ ఇంచార్జి దేవినేని అవినాష్ ల నాయకత్వంలో
కొత్తగా వైఎస్ఆర్ పార్టీ లో చేరే కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి
పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు. ఆనంతరం 300 పైగా మోటర్ బైక్ లతో
ర్యాలీగా బెంజ్ సర్కిల్ వరకు ప్రదర్శన జరుగుతుందన్నారు. ఏ కార్యక్రమాన్ని
విజయవంతం చేసేందుకు యువత ఉత్సాహంతో కదలి రావాలని ఆకుల శ్రీనివాస్ కుమార్
పిలుపునిచ్చారు. సీఎం జగనన్న సారథ్యంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
చెందుతుందని ఆయన పేర్కొన్నారు.