మచిలీపట్నం : రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ మీడియా
ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కృషి చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు వీర్ల శ్రీరామ్
యాదవ్ స్పష్టం చేశారు.గురువారం కలం కౌంటర్ దినపత్రిక అధినేత రవి కుమార్
నివాసానికి వచ్చిన సందర్భంగా జరిగిన సన్మానం అనంతరం మాట్లాడుతూ, అర్హత ఉన్న
ప్రతి ఒక్కరికీ తక్షణమే ఆక్రిడేషన్ జారీ చేయాలని,సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న
జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని
విజ్ఞప్తి చేసారు. ప్రతి జర్నలిస్ట్ కు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మాణం చేసి
ఇవ్వాలని ,జర్నలిస్టుల పిల్లలకు పీజీ వరకు ఉచిత విద్య,వైద్య సౌకర్యాలు
కల్పించాలని కోరారు.రాత్రి,పగలు తేడా లేకుండా విధి నిర్వహణలో సేవలందిస్తున్న
జర్నలిస్టులకు వాహనాలకు సబ్సిడీ తో కూడిన రుణ సదుపాయం ,కల్పించాలని
ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.గత ప్రభుత్వాల హయాంలో అమలులో ఉన్న జర్నలిస్ట్
సంక్షేమ పధకాలు 10 లక్షల ఇన్సూరెన్స్,వెల్ఫేర్ ఫండ్ 50 కోట్లకు పెంచి, తక్షణమే
20 సం. సర్వీస్ దాటినా జర్నలిస్ట్ లకు పదివేలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని
ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రాష్ట్ర నాయకులు
మన్నే సోమేశ్వరరావు,సిహెచ్ రాజు,అల్లాడ ఆంజనేయులు పాల్గొన్నారు.