విజయవాడ : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు
శతజయంతిని పురస్కరించుకుని 2022 మే 28 వ తేదీ నుండి 2023 మే 28 వ తేదీ వరకు
ఏడాది పాటు జరుపుతున్న ఉత్సవాలలో భాగంగా ఈ నెల 28 వ తేదీ సాయంత్రం 4.30
గంటలకు విజయవాడలోని అనుమోలు గార్డెన్స్ (తాడిగడప 100 అడుగుల రోడ్డు) లో
ఎన్.టి.ఆర్ శతజయంతి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు అఖిలభారత ఎన్.టి.ఆర్.
అభిమానసంఘం, కృష్ణాజిల్లా అధ్యక్షులు మన్నె సోమేశ్వరరావు ఒక ప్రకటనలో
తెలిపారు. ఎన్.టి.ఆర్. సెంటినరీ సెలెబ్రేషన్స్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ
కార్యక్రమంలో ఎన్.టి.రామారావు చారిత్రక ప్రసంగాలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి గా ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాల పుస్తకాలను
ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా
చంద్రబాబు నాయుడు, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్, మరియు నటసింహం
నందమూరి బాలకృష్ణ, ఎం.ఎల్.ఏ., ఎస్.వెంకట నారాయణ, సీనియర్ జర్నలిస్ట్
ముఖ్యఅధితులుగా పాల్గొంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో గల ఎన్టీఆర్ అభిమానులు,
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని
జయప్రదం చేయవలసినదిగా అఖిలభారత ఎన్.టి.ఆర్. అభిమానసంఘం కోరింది.