కొవ్వూరు : పదవులంటే అలంకార ప్రాయం కాదని, మనం చేసే పనిలో, సేవలో మరింత
బాధ్యతను పెంచుతాయని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్
తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో బుధవారం జరిగిన
ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారోత్సవానికి హోంమంత్రి
ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మెంబర్స్ గా వరిగేటి సుధాకర్, నగళ్లపాటి శ్రీనివాస
రావు ఎన్నికయ్యారు. కార్యక్రమం అనంతర హోంమంత్రి ఆసుపత్రి పరిసరాలను, అన్ని
వార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.
స్త్రీల ప్రసూతి విభాగంలో ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయని మంత్రి
ప్రశ్నించగా బాగా అందుతున్నాయని సమాధానం వచ్చింది. ఈ సందర్భంగా హోం మంత్రి
తానేటి వనిత మాట్లాడుతూ వైద్యం ప్రతి పేదవాడికి ఉచితంగా అందజేయాలన్న లక్ష్యంతో
ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, పేదవాడికి
కార్పోరేట్ వైద్యం అందేలా చేశామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం ఎవరూ
ఇబ్బంది పడకుండా మానిటరింగ్ చేయాల్సిన బాధ్యత కమిటీలపై ఉందని తెలిపారు.
ఆసుపత్రి అభివృద్ధి పనులకు సీఎస్ఆర్ ఫండ్స్ ను వినియోగించుకోవాలని మంత్రి
సూచించారు. కొవ్వూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను 50 పడకల నుంచి 100 పడకల
ఆసుపత్రిగా సామర్థ్యం పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు.