32,316 మంది విద్యార్థులకు లబ్ది
విద్యతోనే కుటుంబ ఆర్ధిక ప్రగతి సాధ్యం
కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
ఏలూరు : జగనన్న వసతి దీవెన కింద ఏలూరు జిల్లాలో 32,316 మంది విద్యార్థులకు
చెందిన 29,180 మంది తల్లుల బ్యాంక్ ఖాతాలకు రూ. 30.96 కోట్లు నిధులు జమ చేయడం
జరిగిందని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. బుధవారం అనంతపురం
జిల్లా నార్పల బహిరంగ వేదిక నుంచి జగనన్న వసతి పథకం కింద రూ. 912.71 కోట్ల
ఆర్ధిక సహాయాన్ని కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా రాష్ట్రంలోని అర్హులైన
విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏలూరు జిల్లా
కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న
వెంకటేష్, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ, సోషల్ వెల్ఫేర్ జేడి
మధుసూధనరావు, డిఆర్డిఏ పిడి ఆర్ విజయరాజు, జిల్లా బి.సి. వెల్పేర్ ఆఫీసరు ఆర్.
నాగరాణి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎన్ఎస్ కృపావరం, పలువురు
విద్యార్ధినులు వారి తల్లులు పాల్గొన్నారు. విసి ముగిసిన అనంతరం 2022-23
విద్యా సంవత్సరం మొదటి విడతకు గాను జిల్లాలోని 32వేల 316 మంది విద్యార్ధులకు
మంజూరైన జగనన్న వసతి దీవెన లబ్దిమొత్తం రూ. 30.96 కోట్ల మెగా చెక్కురూపంలో
జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ
విద్యార్ధినులకు అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న
వెంకటేష్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో డిగ్రీ, చదువుతున్న ఇంజనీరింగ్,
మెడికల్ ఇతర కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బి.సి., ఇబిసి, మైనారిటీ
విద్యార్ధులకు 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి విడత జగనన్న వసతి దీవెన
నిధులు సంబందించి 32,316 మంది విద్యార్థులకు చెందిన 29,180 మంది తల్లుల
బ్యాంక్ ఖాతాలకు రూ. 30.96 కోట్లు నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఏలూరు
జిల్లాలో 1494 ఎస్సీ విద్యార్థులుకు ,118 మంది ఎస్.టి విద్యార్థులకు, 1935
మంది బి.సి విద్యార్థులకు, 638 మంది ఇ.బి.సి విద్యార్థులకు, 114 మంది ముస్లిం
మైనారిటీ విద్యార్థులకు, 760 మంది కాపు విద్యార్థులకు , 28 మంది క్రిస్టియన్
మైనారిటీ విద్యార్థులకు లబ్దిచేకూరుతుంది. ఏలూరు నియోజకవర్గంలో 2840 మంది
విద్యార్థులకు రూ.2.76 కోట్లు,చింతలపూడి నియోజక వర్గంలో 5087 మంది
విద్యార్థులకు రూ.4.93కోట్లు,దెందులూరు నియోజక వర్గంలో 5607 మంది
విద్యార్థులకు రూ.5.38కోట్లు, కైకలూరు నియోజక వర్గంలో 4162 మంది విద్యార్థులకు
రూ.3.94 కోట్లు,నూజివీడు నియోజక వర్గంలో 5572 మంది విద్యార్థులకు రూ.5.27
కోట్లు పోలవరం నియోజక వర్గంలో 3874 మంది విద్యార్థులకు 3.74 కోట్లు,
ఉంగుటూరు నియోజక వర్గంలో 4083 మంది విద్యార్థులకు రూ.3.88 కోట్లు,గోపాలపురం
నియోజక వర్గంలోనీ ద్వారక తిరుమల మండలం లో 1091 మంది విద్యార్థులకు రూ.1.05
కోట్లు జమచేయడం జరిగిందన్నారు.
శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్రంలో డిగ్రీ ,
చదువుతున్న ఇంజనీరింగ్, మెడికల్ ఇతర కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ,
బి.సి., ఇబిసి, మైనారిటీ విద్యార్ధులకు 2022-23 విద్యా సంవత్సరానికి మొదటి
విడత జగనన్న వసతి దీవెన కింద రూ. 912.71 నిధులు ముఖ్యమంత్రి వై.ఎస్.
జగన్మోహన్ రెడ్డి విడుదల చేయడం ఆనందంగా ఉందన్నారు. ఏ ప్రభుత్వంలో కూడా ఇంత
పెద్దఎత్తున విద్యాభివృద్ధి కార్యక్రమాలకు చేయలేదన్నారు. మెరిట్ కలిగిన
విద్యార్ధులు ప్రతి ఏడాది కోటి 25 లక్షలు రూపాయలు ఖర్చు అయినా విదేశీవిద్యను
అందించేందుకు ప్రభుత్వ కృషిని ఆయన అభినందించారు. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు
చేస్తున్న ఈ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్సీగా ఉండడం తాను అదృష్టంగా
భావిస్తున్నానన్నారు.