ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఎం.డి.జాని పాషా
వెలగపూడి : ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు
బండి.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి కె.వి.శివారెడ్డి ఆధ్వర్యంలో స్పెషల్
చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ తో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా,
రాష్ట్ర కమిటీ భేటీ అయ్యారు. పైరవీలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా గ్రామ
వార్డు సచివాలయ ఉద్యోగులకు మే నెలలో బదిలీలు జరుగుతాయని స్పెషల్ చీఫ్
సెక్రటరీ అజయ్ జైన్ స్పష్టం చేశారు. ఎ.పి.యన్.జి.ఓస్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షులు బండి.శ్రీనివాసరావు, గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయిస్ ఫెడరేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా ఆధ్వర్యంలోని 21 మంది
రాష్ట్ర కమిటీ సభ్యుల బృందం గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
అజయ్ జైన్ తో భేటీ అయ్యింది. ఈ భేటీలో దాదాపు అరగంట పాటు సచివాలయ ఉద్యోగుల
వివిధ సమస్యల పై చర్చించిన రాష్ట్ర నాయకత్వం సచివాలయ ఉద్యోగులకు తప్పనిసరిగా
బదిలీలు కల్పించాలని,ఇప్పటికే 100 సార్లు వివిధ సందర్భాల్లో అధికారులు,
ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రికి వినతులు అందించామని తప్పనిసరిగా బదిలీలు
కల్పించాలని సమావేశంలో కోరడం జరిగిందన్నారు.
అలాగే మూడున్నర సంవత్సరాలుగా బదిలీల కోసం సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న
సమస్యలు ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సమస్యలు, వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ
క్రమంలో అత్యంత సానుకూలంగా స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్
మాట్లాడుతూ ఉద్యోగాలు ఎంత పారదర్శకంగా కల్పించడం జరిగిందో అంతే పారదర్శకంగా
ఎటువంటి పైరవీలకు తావులేకుండా బదిలీలు కల్పిస్తామని, పాత జిల్లాల ప్రాతి పదికన
బదిలీలు కల్పిస్తామని, రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి
బదిలీలకు అవకాశం కల్పిస్తామని మిగిలిన అన్నీ సమస్యలపై తప్పనిసరిగా పరిష్కారం
కోసం చర్యలు తీసుకుంటామని, బదిలీల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్
రూపొందిస్తామని హామీ ఇచ్చారని బదిలీల ప్రక్రియ అనంతరం నోషనల్ ఇంక్రిమెంట్ల
అంశం పరిశీలిస్తామని తెలిపారని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా
తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.యన్.జి.ఒస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు
బండి.శ్రీనివాస రావు, ప్రధాన కార్యదర్సి కె.వి.శివా రెడ్డి,రాష్ట్ర సహ
అధ్యక్షులు సి.హెచ్.పురుషోత్తమ నాయుడు, ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నాయకులు
ఎం.శశిధర్, జి.గోపయ్య, యస్.కె, రహీం, మెహబూబ్, రాజ్ కిరణ్ తదితరులు
పాల్గొన్నారు.